ములుగు : ములుగు డీఆర్వో ప్రేమలత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విధులకు హాజరయ్యేందుకు మంగళవారం హనుమకొండ నుంచి ములుగుకు వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది.
ములుగు జిల్లా కేంద్రం పరిధిలో ప్రేమ్‌నగర్ వద్ద వడ్లలోడు ట్రాక్టర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకోవడంతో వెనుక వస్తున్న కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈసంఘటలో డీపీఆర్వో ఎడమ చేయి విరిగింది. ములుగు ఏరియా వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం ఆమెను వరంగల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.