ములుగులో 400 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ

ములుగు : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని టీఆర్ఎస్ స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి రాష్ట్రంలోని కొవిడ్ బాధిత కుటుంబాలకు సహాయం చేసేందుకు ఒక మిషన్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో భాగంగా ములుగు జిల్లాలోని గోవిందరావుపేట, పస్రా, చల్వాయి, మోట్లగూడెంతో పాటు ఇతర కుగ్రామాలలో సుమారు 400 కుటుంబాలకు అవసరమైన వస్తువులు, కిరాణా సామాగ్రిని శనివారం విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. దాతలు ముందుకువచ్చి పేదలకు సహాయం చేయాల్సిందిగా కోరారు. కరోనా మహమ్మారి నుండి రక్షణగా విధిగా మాస్కు ధరించాలన్నారు. వీలైతే డబుల్ మాస్క్‌లు ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు ఏఎస్పీ పోతరాజు చైతన్య, ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి, సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్ఐ రవీందర్, ఎంపీటీసీ సభ్యురాలు స్వరూప, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- essentials
- KTR
- Mulugu
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

