Minister Satyavati Rathod | ఆర్థికంగా ఎదిగేందుకు బీసీ బంధును సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి సత్యవతి రాథోడ్
Minister Satyavati Rathod | రాష్ట్రంలోని వెనుకబడ్డ తరగతుల వారిని వృత్తిపరంగా ఆదుకునేందుకు ఉద్దేశించిన బీసీ బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod ) అన్నారు.
ములుగు : రాష్ట్రంలోని వెనుకబడ్డ తరగతుల వారిని వృత్తిపరంగా ఆదుకునేందుకు ఉద్దేశించిన బీసీ బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod ) అన్నారు. ములుగు కలెక్టరేట్లో బీసీ లబ్ధిదారులకు లక్షా ఆర్థిక సహాయాన్ని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని వివరించారు.
వ్యాపారాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో జిల్లాలో 16 మంది ప్రాణాలు కోల్పోయ్యారని, ఆస్తి , పంట నష్టం తీవ్రంగా జరిగిందని తెలిపారు. ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామస్తులు వరదల్లో చిక్కుకొని మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశామని ఆమె వెల్లడించారు.
కొండాయి, బూర్గుపేట, మల్యాల దొడ్ల, గ్రామాల ప్రజలకు ఇండియన్ ఆయిల్ సంస్థ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు 10 లక్షల విలువగల 19 రకాల సరుకులతో కూడిన వెయ్యి కిట్లను మంత్రి అందజేశారు. ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య బాగుపడేలా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని మంజూరు సంతోషించదగిన విషయమని అన్నారు . ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి, రెడ్ కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ గౌస్ ఆలం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్ నాయక్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు పళ్ళ బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

