వరంగల్ : సద్దుల బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో వరంగల్ ఉర్సు రంగలీలా మైదానం, చెరువు వద్ద ఏర్పాట్లను కలెక్టర్ గోపి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పి.ప్రావీణ్య, పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, ఇతర అధఙకారులతో కలిసి పస్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పరిశీలించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అదికారులకు సూచించారు. అనంతరం ఖిలా వరంగల్ లోని మెట్టు దర్వాజ, వరంగల్ చిన్నవడ్డేపల్లి చెరువు, కొత్తవాడలో జరిగే సద్దుల బతుకమ్మ, వరంగల్ ఓసిటీ గ్రౌండ్ లో జరిగే దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, దసరా ఉత్సవ కమిటీ ప్రతినిధులు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.