వరంగల్ : జిల్లాలోని పర్వతగిరి మండలం గోపనపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ కంఠమేశ్వర స్వామి-సూరమాంబ దేవి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే అరూరి రమేష్ గ్రామస్తులకు అందజేశారు. కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, స్థానిక సర్పంచ్, ఎంపిటిసి, టీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.