పచ్చదనం పరుచుకున్న ప్రకృతి వనం
రకరకాల పూలు, పండ్లు, నీడనిచ్చే చెట్లతో పల్లె ప్రకృతి వనం గ్రామస్తులకు ఆనందం.. ఆహ్లాదం పంచుతోంది. ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాక్, సేద తీరేందుకు బెంచీలు, చిన్నారులను ఆకట్టుకునే చిత్రాలు చూడముచ్చట గొలుపుతున్నాయి.
- వాకింగ్ ట్రాక్‌తో పాటు సేద తీరేందుకు ఏర్పాట్లు
- ప్రత్యేక ఆకర్షణగా బుద్ధుడి విగ్రహం
- చిన్నారులను ఆకట్టుకునేలా చిత్రాలు
- పార్క్‌తో కక్కిరాలపల్లికి కొత్త కళ
ఐనవోలు, నవంబర్ 4:రకరకాల పూలు, పండ్లు, నీడనిచ్చే చెట్లతో పల్లె ప్రకృతి వనం గ్రామస్తులకు ఆనందం.. ఆహ్లాదం పంచుతోంది. ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాక్, సేద తీరేందుకు బెంచీలు, చిన్నారులను ఆకట్టుకునే చిత్రాలు చూడముచ్చట గొలుపుతున్నాయి. ఇక్కడి బుద్ధుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా హనుమ కొండ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లిలో ఏర్పాటు చేసిన పార్క్ ప్రజలకు సరికొత్త అనుభూతినిస్తోంది.
పల్లెలను పచ్చదనంగా మార్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతివనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. హరితహారం కార్యక్రమం లో భాగంగా ప్రతి సంవత్సరం లక్షలాది మొక్కలను నాటుతున్న ది. రెండేళ్ల క్రితం గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణంలో సేదతీరడానికి ప్రభుత్వం ప్రతి గ్రామంలో వీటిని ఏర్పాటు చేసింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని కక్కిరాలపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనం పచ్చని చెట్లతో అందరినీ ఆకట్టుకుంటున్నది. అందులో తిరగడానికి వీలుగా రోడ్లు, కూర్చోవడానికి సిమెంట్ బల్లలు, నీటివసతి ఏర్పాటు చేశారు.
వాకింగ్ ట్రాక్‌లు..
పల్లె ప్రకృతి వనంలో చిన్నారులను ఆకర్షించేందుకు రాళ్లు, పాడైన టైర్లు, ఉపయోగించిన పిల్లర్లపై సుందరంగా చిత్రాలను గీయించారు. అదేవిధంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో నడక కోసం 5 మీటర్ల వెడల్పుతో 100 మీటర్ల వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. పచ్చని చెట్ల నడుమ సేద తీరడానికి బెంచీలను అందంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా పార్కు మధ్యలో మూడు మీటర్ల వెడల్పుతో 14 మీటర్ల పొడవునా ప్రత్యేకమైన గడ్డిని పెంచుతున్నారు.
ఎనిమిది వరుసల్లో మొక్కలు..
ప్రకృతి వనంలో ఎనిమిది వరుసల్లో నాలుగు వేల మొ క్కలు నాటారు. మొదటి వరుసలో ఏపుగా పెరిగే నీడనిచ్చే, మధ్య వరుసలో పండ్లు, లోపలి వరుసలో ఆకర్షణీయంగా కనిపించే రంగురంగుల పూల మొక్కలు నాటారు. రూ. 7 లక్షలతో పల్లె ప్రకృతి వనాన్ని ముస్తాబు చేశారు. దాత సహకారంతో గౌతమ బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేయగా, అక్కడికి వచ్చిన వారు సెల్ఫీలు దిగుతూ సంబురపడుతున్నారు. అదేవిధంగా ఎడ్లబండిని ప్రత్యేకంగా అలంకరించారు.
గామానికి కొత్త కళ
గ్రామంలో ప్రత్యేక అకర్షణగా ప్రకృతి వనం ఏర్పాటు చేశాం. అప్పుడు నాటిన మొక్కలు నీడనిచ్చే చెట్లుగా ఎదిగాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు పార్కులను అందుబాటులోకి తేవడం అనందంగా ఉన్నది. పార్కు ఏర్పాటు కావడంతో గ్రామం నూతన కళను సంతరించుకున్నది.
– కంజర్ల రమేశ్, సర్పంచ్, కక్కిరాలపల్లి
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

