Bhupalpally : ప్రత్యామ్నాయనికి ప్రాధాన్యతనివ్వండి.. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి టౌన్ : కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేనందున రైతులు అనువైన చోట ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు ప్రయత్నం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. ఆదివారం భూపాలపల్లి మండలంలోని గొల్లబుద్ధారంలో జంగేడు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం యాసంగిలో వడ్లు కొనేదిలేదని, వరి పంటలు వేయొద్దని కోరడం సరికాదన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుపడిన దాఖలాలు లేవని, కేంద్రానికి రైతుల గోస తగులుతుందన్నారు. రైతులు మాత్రం సాధ్యమైనంత వరకు వరి పంటను తగ్గించుకోవాలని ఇది డిమాండ్ కాదని రైతుల బాగోగులను దృష్టిలో ఉంచుకుని చెప్పడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ మందల లావణ్య, జంగేడు పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్‌కుమార్ యాదవ్, వైస్ ఎంపీపీ సముద్రాల దీపారాణి శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిన్‌రెడ్డి రాజిరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మందల విద్యాసాగర్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాంపెల్లి శ్రీనివాస్, సీఈఓ సల్ల రవీందర్, డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

