POLYCET Ranker : పాలీసెట్ పరీక్షలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంక్ సాధించిన యూనివర్సల్ హై స్కూల్ విద్యార్థి ఆదిత్య వర్మ (Aditya Varma)ను ఉపాధ్యాయులు అభినందించారు. పదో తరగతిలో పదికి పది పాయింట్లు తెచ్చుకున్న ఆదిత్య.. ఇప్పుడు పాలీసెట్లోనూ టాపర్గా రావడంతో పాఠశాల కరస్పాండెంట్ మహ్మద్ ఇస్మాయిల్, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.
పాలకుర్తి మండలం ఘనశ్యాందాస్ నగర్ గ్రామపంచాయితీ పరిధిలోని యూనివర్సల్ హై స్కూల్లో చదివిన ఆదత్య వర్మ10వ తరగతి లో 10పాయింట్స్ సాధించాడు. శనివారం విడుదలై పాలిసెట్ పరీక్ష ఫలితాల్లో అతడు స్టేట్ 21వ ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మహ్మద్ ఇస్మాయిల్, ప్రధానోపాధ్యాయులు సయ్యద్ అఫ్జల్, ఉపాద్యాయులు ఆదిత్యను అభినందించారు.
