హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 12: కాకతీయ యూనివర్సిటీలో రెండురోజులుగా జరుగుతున్న ఇంటర్ కాలేజియేట్ కబడ్డీ ఫైనల్స్‌లో ఖమ్మం ఎస్సార్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ విజేతగా నిలవగా రన్నర్‌గా హనుమకొండకు చెందిన వాగ్దేవి కాలేజీ జట్టు నిలిచింది. చివరి వరకు జరిగిన ఉత్కంఠభరిత పోటీలో కేవలం రెండు పాయింట్ల తేడాతో ఖమ్మం జట్టు విజేతగా నిలిచింది. ఈ ఫైనల్ మ్యాచ్ శుక్రవారం ఉదయం విశ్వవిద్యాలయ క్రీడామైదానంలో వ్యాయామ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య టి. మనోహర్ నేతృత్వంలో నిర్వహించారు.
మ్యాచ్‌లో ఖమ్మం జట్టు 28 పాయింట్లు, వాగ్దేవి జట్టు 26 పాయింట్లు సాధించాయి. విజేత జట్టుకు మొదటి బహుమతి, రన్నరప్ జట్టుకు రెండవ బహుమతులను స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఆచార్య వై. వెంకయ్య, కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య టి. మనోహర్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎస్.కుమారస్వామి, జత్య, కిరణ్‌గౌడ్, సోమన్న, పాషా, పల్లవి, సుమన్, బుచ్చన్న, అన్వేష్ పాల్గొన్నారు.