అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
వచ్చే ఫిబ్రవరిలో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మల మహాజాతర అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మంత్రి పీఆర్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మేడారం మహాజాతర సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం పరిశీలించారు.
- భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూడాలి
- సమష్టి కృషితో మేడారం మహాజాతరను విజయవంతం చేయాలి
- పీఆర్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క
- జాతర అభివృద్ధి పనుల పరిశీలన
తాడ్వాయి/గోవిందరావుపేట, డిసెంబర్ 25: వచ్చే ఫిబ్రవరిలో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మల మహాజాతర అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మంత్రి పీఆర్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మేడారం మహాజాతర సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం పరిశీలించారు. 33 పార్కింగ్ ప్రదేశాలతోపాటు చింతల్‌క్రాస్, ఊరట్టం వంతెన, చిలకలగుట్ట, వీఐపీ పార్కింగ్, ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించి, చేపడుతున్న పనులను అడిగి తెలుసుకున్నా రు. అదేవిధంగా గోవిందరావుపేట మండలంలోని పస్రా సమీపంలోని గుండ్లవాగు బ్రిడ్జిని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేపట్టి అన్ని శాఖల అధికారులు సమష్టి కృషితో మహాజాతరను విజయవంతం చేయాలన్నారు. ఆరు నెలల క్రితం కురిసిన భారీ వర్షంతో గుండ్లవాగు బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డు కొట్టుకుపోగా ఎన్‌హెచ్ అధికారులకు మరమ్మతులు చేపట్టారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టాలని మంత్రి సూచించారు.
అంతేకాకుండా బ్రిడ్జి పక్కన వాగులో మరో అప్రోచ్ రోడ్డు వేయించాలన్నారు. అదేవిధంగా పస్రా-మేడారం రహదారిలో కొట్టుకుపోయిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టి భక్తులకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పనులను వేగవంతం చేసేలా చూడాలన్నారు. మంత్రి సీతక్క మొదటగా అమ్మవార్ల దర్శనానికి వెళ్లగా పూజారులు, దేవాదాయశాఖ అధికారులు, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీఓ అంకిత్, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, ఎస్పీ గాష్‌ఆలం ఘనంగా స్వాగతం పలికి తల్లుల గద్దెల వద్దకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొ క్కులు చెల్లించుకున్నారు. మంత్రికి పూజారులు అమ్మవార్ల వస్ర్తాలతో పాటు ప్రసాదాన్ని అందజేశారు
.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

