మొరం మాఫియా అకృత్యం
మొరం మాఫియా అకృత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అక్రమ దందాను అడ్డుకుంటున్న అధికారులు, సిబ్బందిపై అధికార పార్టీ నాయకులు దాడులకు దిగుతున్నారు. దీంతో వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నర్సంపేట మున్సిపాలిటీ పరిధి మాధన్నపేట చెరువులో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు మట్టి, మొరం దందాను కొన్ని రోజులుగా కొనసాగిస్తున్నారు.
- దందాను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిపై దాడి
- ఇద్దరిని బంధించి, ఫోన్లు లాక్కున్న అక్రమార్కులు
నర్సంపేట, జూన్11 : మొరం మాఫియా అకృత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అక్రమ దందాను అడ్డుకుంటున్న అధికారులు, సిబ్బందిపై అధికార పార్టీ నాయకులు దాడులకు దిగుతున్నారు. దీంతో వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నర్సంపేట మున్సిపాలిటీ పరిధి మాధన్నపేట చెరువులో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు మట్టి, మొరం దందాను కొన్ని రోజులుగా కొనసాగిస్తున్నారు. పలువురు గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో నర్సంపేట తహసీల్దార్ రవిచంద్రారెడ్డి ఆదేశాల మేరకు మాధన్నపేట జీపీవో చెలుకలపల్లి నర్సింహస్వామి మరో ఉద్యోగితో కలిసి మట్టి తరలిస్తున్న ప్రాంతానికి బుధవారం రాత్రి వెళ్లారు.
అక్రమంగా మట్టి తరలించొద్దని, ఎలాంటి అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. దీంతో మొరం దందా నిర్వాహకులు దాడికి పాల్పడ్డారు. ఇద్దరి సెల్ఫోన్లు, బైక్ తాళాలు లాక్కొని తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. గాయాలతో అక్కడి నుంచి బయటపడిన వారు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. గురువారం గాయపడిన ఉద్యోగులకు పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ దాడిపై నియోజకవర్గంలోని రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు మొరం దందా నిర్వాహకుడైన నర్సంపేటకు చెందిన బైకాని రాకేశ్‌తో పాటు అతడి అనుచరులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గూడ అరుణ్‌కుమార్ తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

