హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 23: మానవ అక్రమ రవాణాను అరికట్టాలని మానవ అక్రమ రవాణా విభాగం సిఐ జె.శ్యాంసుందర్ అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ (కో-ఎడ్యుకేషన్)లో ప్రిన్సిపల్ ఆర్.శ్రీనివాసరావు అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్యాంసుందర్ మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా మత్తుపదార్థాలు రవాణా చేయడం, మానవుల అవయవాల రవాణా, అమ్మాయిలను, మహిళలను తరలించడం, సైబర్ నేరాలు ద్వారా అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేయడం, మానవఅక్రమ రవాణా చాలా నీచమైన పని అని ఈ ప్రమాదాల పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మహిళలు ఇతర దేశాలకు తరలించడం, వ్యభిచార గృహాలకు పంపించడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఇలాంటి నేరాలు జరుగుతుంటాయని, విద్యార్థులకు సమాజంలో జరిగే అనేక నేరాలను ఉదాహరణలతో ఆయన వివరించారు.
అధ్యాపకులు కే.శ్రీదేవి, శోభ, సువర్ణ, రాజేంద్రప్రసాద్, రాజేష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్.రాజ్‌కుమార్, మానవ అక్రమ రవాణా విభాగం ఎస్సై సుధాకర్, ఏఎస్ఐ భాగ్యలక్ష్మి, కానిస్టేబుల్ రామారావు పాల్గొన్నారు.