Heroine Suhasini | న్యూశాయంపేట, ఆగస్టు 20 : హన్మకొండ పట్టణంలోని టీచర్స్ కాలనీలోని తెలంగాణ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన దనైరా సిల్క్ షాపింగ్ మాల్‌ను హీరోయిన్ సుహాసిని బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు హన్మకొండకు విచ్చేసిన సినీ హీరోయిన్ సుహాసినిని చూసేందుకు పట్టణవాసులు ఆసక్తి చూపారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ షాపింగ్ మాల్లో పట్టణ ప్రజల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించామని చెప్పారు. మాల్లో పట్టు ధర్మవరం, కాంచీపురం, మంచి కలెక్షన్స్, పట్టు శారీస్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇందులో సరసమైన ధరలకే లభిస్తున్నాయని, ఓపెనింగ్ ఆఫర్ 27 ఆగస్టు 2025 వరకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ ఆఫర్లను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనికోరారు. ఈ కార్యక్రమంలో షాప్ ఓనర్ భవాని, దిలీప్ రెడ్డి, సినిమా డైరెక్టర్ కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.