హనుమకొండ చౌరస్తా, జూలై 24: తెలంగాణ భవిష్య త్ తరాలకు మాజీ మంత్రి, కేటీఆర్ ఆశాకిరణం అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాసర్ అన్నారు. బుధవారం కేటీఆర్ జన్మదినం సందర్భంగా పార్టీ ఆఫీస్ లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. భద్రకాళీ, హనుమాన్, సాయిబాబా, గణపతి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం ధార్మిక భవనంలోని వేద పాఠశా ల విద్యార్థులకు వేద గ్రంథాలు, వస్త్రాలను అందజేశారు.
బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు పెద్దఎత్తున రక్తదానం చేశారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ.. విజన్ కలిగిన నవ యువనాయకుడు కేటీఆర్ అని, తెలంగాణను ఐటీ, పారిశ్రామిక రంగాల్లో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపిన నేత అని కొనియాడారు. ప్రతిపక్షంలోనూ ప్రజల పక్షాన పోరాడుతున్న యోధుడు అని పేర్కొన్నా రు. అనంతరం కేక్‌ను పార్టీ శ్రేణుల సమక్షంలో కట్ చేశా రు. ఆఫీస్ ఆవరణలో మొకలు నాటారు. అనంతరం అదాలత్‌లోని మదర్సాలలో విద్యార్థులకు పండ్లు, బ్రెడ్, బిసెట్లు పంపిణీ చేశారు.
హనుమకొండ చౌరస్తా/సుబేదారి/బాలసముద్రం, అదాలత్ ప్రాంతాల్లో రోడ్ల వెంట ఉన్న చిరు వ్యాపారుల కు దాస్యం గొడుగులను అందజేశారు. కార్యక్రమంలో టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, పశ్చిమ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, సంకు నర్సింగ్, సోదా కిరణ్, మాజీ కార్పొరేటర్లు దాస్యం విజయ్భాసర్, జోరిక రమేశ్, మహ్మద్ సిరాజుద్దీన్, మేకల బాబురావు, కుసుమ లక్ష్మీనారాయణ, తండమల్ల వేణు, మాజీ ఎంపీపీ రఘు, నాయకులు నరెడ్ల శ్రీధర్, సల్వాజీ రవీందర్రావు, బుద్దె వెంకన్న, రామ్మూర్తి, నయీముద్దీన్ పాల్గొన్నారు.
మహబూబాబాద్ రూరల్/కృష్ణకాలనీ/పరకాల: కేటీఆర్‌ను ఎమ్మెల్సీలు సత్యవతిరాథోడ్, తక్కళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.