ఖానాపురం, డిసెంబర్ 17 : పాకాల సరస్సులో త్వరలో బోటు షికారు ప్రారం భం కానున్నది. పాకాల తుంగబంధం తూము పక్కనే అటవీ శాఖ రూ.50 లక్షలతో బోటింగ్ పాయింట్ ఏర్పాటుచేసిం ది. రెండు బోట్లను(స్పీడ్, షేరింగ్) తెప్పించి కొద్ది రోజులుగా ఎఫ్ఆర్వో రవికిరణ్ ఆధ్వర్యంలో సరస్సులో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.
పనులన్నీ పూర్తికావడంతో ఈ నెల 25లోపు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా బోటింగ్ ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా అటవీ, పర్యాటక శాఖల మధ్య ఆర్థిక పరమైన వివాదం కారణంగా బో టింగ్ సేవలు నిలిచిపోయాయి. ఎట్టకేలకు ప్రారం భం కానుండడంతో పర్యాటకుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. అలాగే త్వరలో జిప్‌లైన్ పనులను సైతం చేపట్టనన్నట్లు అటవీ అధికారులు తెలిపారు.