తెలంగాణ గొంతుక బీఆర్ఎస్కు పట్టంకట్టండి
ప్రజల గొంతుక బీఆర్ఎస్ పార్టీయేనని, ఢిల్లీలో తెలంగాణ వాణి వినిపించేందుకు కారు గుర్తుకు ఓటు వేసి వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు.
- కాంగ్రెస్, బీజేపీలు మోసకారి పార్టీలు
- హామీల అమలులో రేవంత్‌రెడ్డి సర్కారు విఫలం
- పాలకుర్తి రోడ్‌షోలో మాజీ మంత్రి ఎర్రబెల్లి
- కారు గుర్తుకు ఓటేసి సుధీర్‌కుమార్‌ను గెలిపించాలి
- ద్రోహులను నమ్మి మోసపోవద్దు
పాలకుర్తి రూరల్, మే 11: ప్రజల గొంతుక బీఆర్ఎస్ పార్టీయేనని, ఢిల్లీలో తెలంగాణ వాణి వినిపించేందుకు కారు గుర్తుకు ఓటు వేసి వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చి మోసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి గుణపాఠం చెప్పాలన్నారు. కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్, బీజేపీలను బొంద పెట్టాలన్నారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన శనివారం జనగామ జిల్లా పాలకుర్తిలోని రాజీవ్ చౌరస్తాలో రోడ్‌షోలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, వరంగల్ అభ్యర్థి మారెపల్లి సుధీర్‌కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డితో కలిసి ఎర్రబెల్లి హాజరయ్యారు. రోడ్‌షోకు పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావడంతో పాలకుర్తి జనసంద్రమైంది. ఈ సందర్భంగా దయాక ర్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల బతుకులు ఆగమయ్యాన్నారు. ప్రజలను మోసం చేసిన రేవంత్‌రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. హామీలు అమలు చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారన్నారు. కారు గుర్తుపై గెలిచి అధికార దాహంతో కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, బీజేపీలో చేరిన అరూరి రమేశ్ దొంగలని మండిపడ్డారు. కడియం శ్రీహరికి రాజకీయ భిక్ష పెట్టింది తానేనని ఎర్రబెల్లి గుర్తుచేశారు.
కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసి నాలుగు సార్లు ఓడిపోయాడని చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని, గోదావరి జలాలతో చెరువులు నింపానన్నారు. మిషన్‌భగీరథతో ఇంటింటికీ నల్లానీరు ఇచ్చామని, గ్రామాల్లో సీసీరోడ్లు వేశానన్నారు. నియోజకవర్గంలో దేవాలయాలను నిర్మించానని, రహదారులు వేశానన్నారు. తండాలను జీపీలుగా మార్చానని చెప్పారు. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. ఇన్ని చేసిన తనను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టారని మాజీ ఎర్రబెల్లి ఒక్కసారిగా భావోద్వేగానికి గురి కావడంతో మహిళలు కంట తడిపెట్టారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. పాలకుర్తి గడ్డ దయన్న అడ్డా అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పాలకుర్తి నుంచే విజయం సాధిస్తానన్నారు. పాలకుర్తిలో 20వేల మెజార్టీ బీఆర్ఎస్కు ఖాయమన్నారు.
తెలంగాణ ద్రోహులను పాతరేయాలి : సిరికొండ
కడియం శ్రీహరి, అరూరి రమేశ్ ఇద్దరూ తెలంగాణ ద్రోహులని, వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఓటుతో కడియం శ్రీహరిని రాజకీయంగా సమాధి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ అమలు చేసిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థికి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు.
కడియం శ్రీహరి కాదు..కన్నింగ్ శ్రీహరి : ఏనుగుల రాకేశ్‌రెడ్డి
కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి.. ఓ కన్నింగ్ శ్రీహరి అని బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్కు మోసంచేసిన కడియం శ్రీహరి, అరూరి రమేశ్‌కు ఓటుతో గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. మార్పు అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టిందని మండిపడ్డారు. నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు భర్తీ చేసిన ఉద్యోగాలే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల బతుకులు ఆగమయ్యాయన్నారు. వరంగల్ ఎంపీగా సుధీర్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
ఎవరొచ్చినా గెలుపు నాదే : సుధీర్‌కుమార్, వరంగల్ అభ్యర్థి
ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రచారం చేసినా వరంగల్ ఎంపీగా గెలుపు నాదే. పార్టీలు మారే వారికి వరంగల్ ప్రజలే బుద్ధి చెబుతారు. దమ్ముంటే కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులు, కారు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలి.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

