నర్సింహులపేట, మే 7 : ఇద్దరు రైతుల మధ్య వచ్చిన గొడవ కారణంగా ప్యాడీ క్లీనర్ మిషన్ కు తాళం వేసిన సంఘటన బుధవారం మండలంలోని ముంగిమడుగు ధాన్యం కొనుగోలు కేంద్రంలో చోటుచేసుకుంది. కొనుగోలు కేంద్రం వద్ద వడ్లు శుభ్రం చేసేందుకు ఏర్పాటుచేసిన ప్యాడి క్లీనర్ ఒకటే ఉండడంతో మంగళవారం సాయంత్రం ప్యాడీ క్లీనర్ బెల్ట్ తెగిపోయింది. ధ్యానం పెట్టేందుకు రైతుల మధ్య గొడవ జరిగింది. రాత్రి ప్యాడీ క్లీనర్ కనిపించకుండా టార్పాలిన్లు వేశారని నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో ప్యాడి క్లీనర్‌కు తాళం వేశారు.
25 నుండి 30 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చినప్పటికీ కాంటాలు నిర్వహించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్యాడీ క్లినర్ సైతం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని రైతుల ఆరోపిస్తున్నారు. వాన కాలంలో సైతం ధాన్యం బస్తాలు అపహరణకు గురయ్యాయాన్ని సాయంత్రం వేళ కనీసం లైట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.