కాంటా పెట్టిన వడ్లను మిల్లుకు తరలించడంలో జాప్యం
ఐకేపీ సెంటర్లో కాంటా పెట్టిన వడ్లను మిల్లుకు తరలిం చకుండా నిర్వాహకులు నిర్లక్ష్యం చేయడంతో మనస్తాపానికి గురైన రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హసన్ పర్తి మండలం మడిపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మడిపల్లికి చెందిన రైతు ముంజ శ్రీనివాస్‌గౌడ్(49) తన ఎకరం పొలంతోపాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. పండిన వడ్లను 20 రోజుల క్రితం మడిపల్లి లోని ఐకేపీ సెంటర్లో పోశాడు. రోజుల తరబడి ఎదురుచూడగా, మూడు రోజుల క్రితం కాంటా పెట్టారు.
- మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
హసన్‌పర్తి, మే 29 : ఐకేపీ సెంటర్లో కాంటా పెట్టిన వడ్లను మిల్లుకు తరలిం చకుండా నిర్వాహకులు నిర్లక్ష్యం చేయడంతో మనస్తాపానికి గురైన రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హసన్ పర్తి మండలం మడిపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మడిపల్లికి చెందిన రైతు ముంజ శ్రీనివాస్‌గౌడ్(49) తన ఎకరం పొలంతోపాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. పండిన వడ్లను 20 రోజుల క్రితం మడిపల్లి లోని ఐకేపీ సెంటర్లో పోశాడు. రోజుల తరబడి ఎదురుచూడగా, మూడు రోజుల క్రితం కాంటా పెట్టారు.
కానీ, ఐకేపీ కేంద్రం నిర్వాహకులు రైస్ మిల్లుకు తరలించకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించి రైతులు వెంటనే శ్రీనివాస్ ఒంటిపై నీళ్లు పోయడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఐకేపీ సెంటర్ వారితో మాట్లాడి శ్రీనివాస్ వడ్లను మిల్లుకు పంపేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

