Putta Madhukar | ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటా కన్నీళ్లేనా? : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
Putta Madhukar | తెలంగాణలో ఇందిరమ్మ పాలన అంటే ఇంటింటా కన్నీళ్లే కనిపిస్తున్నాయని, ఇదేనా కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రజాపాలన అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
మహాదేవపూర్ ( భూపాలపల్లి) : తెలంగాణలో ఇందిరమ్మ పాలన ( Indiramma Rajyam ) అంటే ఇంటింటా కన్నీళ్లే కనిపిస్తున్నాయని, ఇదేనా కాంగ్రెస్ ( Congress ) పార్టీ చెప్పిన ప్రజాపాలన అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ( Putta Madhukar ) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 25 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులను శుక్రవారం ఆయన పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్హెచ్ఎం ఉద్యోగులు 25 రోజులుగా దీక్షలు చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందించే సిబ్బంది సమ్మెబాట పట్టడం తో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల్లో అధిక సంఖ్యలో మహిళలు ఉన్నప్పటికీ వారికి కనీసం ప్రసూతి సెలవులు కూడా కల్పించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగులకు ఈఎస్ఐ, ఈహెచ్ఎస్ సౌకర్యాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, రెగ్యులరైజేషన్ సహా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Putta Madhukar | ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటా కన్నీళ్లేనా? : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
AIADMK Leader Arrest | టీవీకే ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఎర.. ఏఐఏడీఎంకే నేత అరెస్ట్
మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీకృష్ణ మధ్య ముదురుతున్న వివాదం.. గాంధీభవన్‌కు చేరిన పంచాయితీ!
Harish Rao | ఎండిపోయిన ప్రతి ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే.. హరీశ్‌రావు డిమాండ్
Fund Allocation | నిధుల కేటాయింపులో రాజకీయ వివక్ష చూపించవద్దని బీఆర్ఎస్ సర్పంచుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

