1న బీఆర్ఎస్ చలో మేడిగడ్డ
మార్చి 1న ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లిలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌ను సందర్శించనున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు.
- కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులతో బరాజ్ సందర్శన
- తెలంగాణ భవన్ నుంచి నేరుగా మేడిగడ్డకు
- సుమారు 200 మంది రాక
మహదేవపూర్, ఫిబ్రవరి 27 : మార్చి 1న ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లిలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌ను సందర్శించనున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు సుమారు 200 మందితో కలిసి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి (శుక్రవారం) ఉదయం 8.30 గంటలకు బయలుదేరి నేరుగా మేడిగడ్డకు చేరుకొని బరాజ్‌ను పరిశీలించనున్నారు. కొన్ని నెలల క్రితం మేడిగడ్డ బరాజ్‌లో పియర్లు కుంగిన విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం బరాజ్ మరమ్మతు విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్న నేపథ్యంలో దానిని సందర్శించిన అనంతరం కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టి , కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో అందుతున్న ఫలాలను కేటీఆర్ ప్రజలకు వివరించనున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

