నో క్లారిటీ.. !
రైతులకు రుణమాఫీ రంది పట్టుకున్నది. లోన్ మాఫీ అయిందా? కాలేదా? అనే స్పష్టత లేకపోవడంతో ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకున్నారు. గురువారం సాయంత్రం నుంచి ఈ ఉత్కంఠ ఇలాగే కొనసాగుతుండగా శుక్రవారం ఉదయం పాస్‌పుస్తకాలు, ఆధార్‌కార్డులతో బ్యాంకులకు పరుగులు తీశారు.
- రుణమాఫీపై కొనసాగుతున్న సస్పెన్స్
- లోన్ మాఫీ అయిందో లేదోనని అయోమయం
- స్పష్టత ఇవ్వని బ్యాంకులు, అగ్రికల్చర్ అధికారులు
- వివరాలు తెలియిక ఆగమవుతున్న రైతులు
- బ్యాంకుల వద్దకు పరుగులు
- సమాధానం దొరకక తిప్పలు
వరంగల్, జూలై 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతులకు రుణమాఫీ రంది పట్టుకున్నది. లోన్ మాఫీ అయిందా? కాలేదా? అనే స్పష్టత లేకపోవడంతో ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకున్నారు. గురువారం సాయంత్రం నుంచి ఈ ఉత్కంఠ ఇలాగే కొనసాగుతుండగా శుక్రవారం ఉదయం పాస్‌పుస్తకాలు, ఆధార్‌కార్డులతో బ్యాంకులకు పరుగులు తీశారు. అక్కడ ఆరా తీసినా వివరాలు తెలియకపోవడంతో నిరాశతో ఇంటిబాట పట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేసినట్లు ప్రకటించినా ఇప్పటికీ వీటిపై రైతుల్లో అయోమయం నెలకొన్నది. రుణ మాఫీ ప్రకటన జరిగి 24గంటలు గడిచినా తాము తీసుకున్న లోన్లు ఏమయ్యాయో వారికి అంతుచిక్కడంలేదు. రుణాల మాఫీపై స్పష్టత కోసం భారీ సంఖ్యలో రైతులు బ్యాంకులకు వెళ్లి ఆరా తీస్తున్నారు. బ్యాంకర్ల నుంచి దీనిపై సరైన సమాధానం రావడంలేదు. గ్రామాల వారీగా గానీ, బ్యాంకుల వారీగా గానీ లోన్లు మాఫీ అయిన వారి పేర్ల జాబితా అందుబాటులో లేక అందరూ ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు నిబంధన పెట్టడం వల్ల తమ రుణాలు ఏమయ్యాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కుటుంబంలో ఒక్కరికే లోను మాఫీ అనడంతో ఎవరెవరికి మాఫీ అయ్యాయో తెలియడం లేదు. అప్పటినుంచి రైతులు తమ సెల్ ఫోన్ల ను చూసుకుంటున్నారు. లోనుకు సరిపడా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులో జమ చేస్తున్నట్లుగా ఫోన్లకు మెసేజ్‌లు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. శుక్రవారం ఉదయం వరకు ఎదురుచూశారు. ఎలాంటి మెసేజ్‌లు రాకపోవడంతో బ్యాంకులకు వెళ్లి లోను మాఫీ గురించి ఆరా తీస్తున్నారు.
నిబంధనలే కారణమా..
కేసీఆర్ ప్రభుత్వం తరహాలో ప్రతి రైతు రుణాలు మాఫీ అవుతాయని అందరూ ఆశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల నిబంధనలను పెట్టడంతో ఇప్పుడు రైతుల్లో ఆందోళన నెలకొన్నది. రేషన్‌కార్డు ప్రాతిపదికగా కుటుంబంలో ఒక్కరికే లోను మాఫీ చేస్తామనే నిబంధనలో ఎవరెవరికి రుణాలు మాఫీ అయ్యాయనేది అర్థం కావడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు లేకుండా అందరికీ పంట రుణాలు మాఫీ చేసింది.
దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొందరికే మాఫీ చేస్తుండడంతో ఎక్కువ మందిలో ఆందోళన ఉన్నది. రుణ మాఫీ అయిన రైతుల జాబితాను ఎక్కడా వెల్లడించకపోవడంతో ఈ ఆందోళన పెరుగుతున్నది. లోన్లు మాఫీ అయిన వారి జాబితాను వెంట నే ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రైతుల జాబితాను వాట్సాప్, ఇతర సోషల్ మీడియాల్లో ప్రచారం అయ్యాయి. మాఫీ అయిన వారి జాబితానా? రుణమాఫీకి అర్హుల జాబితానా? అనేది స్పష్టత రావడం లేదు.
సహకార లోన్లదీ అదే పరిస్థితి
వ్యవసాయ సహకార సంఘాలో లోన్లు తీసుకున్న వారి పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉన్నది. బ్రాంచీల వారీగా మాఫీ అయిన వారి జాబితాలు బయటికి ఇవ్వడం లేదు. ఎక్కువ శాఖల్లో అర్హుల పేర్లతో ఉన్న జాబితాలు అందరికీ వచ్చాయి. వీటిపై ఆరా తీయగా ఆ పేర్లు లోన్లు మాఫీ అయిన వారికి కాదని, మాఫీ కోసం బ్రాంచీల నుంచి ప్రభుత్వానికి పంపిన జాబితాలను అని అధికారులు చెప్పారు.
సారూ.. నా పేరుందా లోన్ మాఫీ అయిందా
రుణమాఫీ అయిందో? కాలేదో? తెలియక రైతులు తికమకపడుతున్నారు. పాస్ బుక్కులు, ఆధార్ కార్డులు పట్టుకొని అటు వ్యవసాయ శాఖ కార్యాలయానికి, బ్యాంకుల వద్ద పరుగులు తీస్తున్నారు. ఏవో దగ్గరికి వెళ్తే బ్యాంకుకు వెళ్లాలని.. అక్కడికి వెళ్తే ఇక్కడికి అని తిప్పుతుండడంతో బేజార్ అవుతున్నారు. శుక్రవారం ఇలా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్‌కు వచ్చిన రైతులు సిబ్బందిని ఆరా తీశారు. అర్హత ఉన్నా మాఫీ ఎందుకు కాలేదని అడిగితే తమకు తెలియదని వ్యవసాయ శాఖ అధికారులను అడుగాలని చెప్పడంతో అసహనానికి గురయ్యారు. రేవంత్ సర్కారు చెప్పిందొకటి.. చేసేదొకటి అంటూ నిట్టూర్చుతూ అక్కడి నుంచి వెళ్లిపోవడం కనిపించింది.
– మహబూబాబాద్, జూలై 19(నమస్తే తెలంగాణ)
అరచేతిలో బెల్లం పెట్టింది..
నల్లబెల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో అన్నదాతల అరచేతిలో బెల్లం పెట్టింది తప్ప.. చేసిందేమీ లేదు. గ్రామానికో 10 మంది లెక్కన రుణమాఫీ చేసిండ్రు. సీఎం రేవంత్‌రెడ్డి సార్ రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ చేస్తమని చెప్పి, మాట తప్పిండు. వ్యవసాయశాఖ కార్యాలయంలో రుణమాఫీ వెబ్సైట్లో ఆధార్ నంబర్ లింక్ చేస్తే సంబంధిత వ్యక్తికి రేషన్‌కార్డు లేనందున మాఫీ వర్తించదని స్పష్టంగా చూపిస్తున్నది. అలాగే అదే ఆధార్‌లింక్‌తో కుటుంబంలో ఎంత మందికి ఏయే బ్యాంకుల్లో క్రాపులోన్ ఉందనే సమాచారం కూడా వస్తున్నది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబంలో ఒకే వ్యక్తికి ఒకే క్రాప్‌లోన్ ఉన్న వారికి మాత్రమే మొదటి విడుతలో రుణం మాఫీ చేసినట్లు తెలుస్తున్న ది. ప్రభుత్వం ఇచ్చిన హామీని పూర్తిగా విస్మరించింది. ఇది స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం చేస్తున్న జిమ్మిక్కుగా అర్థమవుతున్నది.
-గుగులోత్ సారయ్య, రేలకుంట
కేసీఆర్ మాఫీ చేసినప్పుడు ఇప్పుడెందుకు కాదు?
టేకుమట్ల: నాకు గతేడాది కేసీఆర్ సార్ రూ.90 వేల రుణం మాఫీ చేసిండు. ఎన్నికలప్పుడు రేవంత్‌రెడ్డి మళ్లీ లోన్లు తీసుకోండ్లి.. మాఫీ చేస్తానని మాట ఇచ్చిం డు. కానీ, ఇప్పుడు నాకు రుణమాఫీ కాలేదు. ఎం దుకని అడిగితే నా కొడుకు రుణం కూడా కలిపి ఇద్దరి రూ.లక్ష దాటింది. తర్వాత మాఫీ అయితది అంటున్నరు. ఎవరి రుణం వాళ్లకే మాఫీ చేయాలె.. ఇట్ల లింకు పెట్టుడేంది. ఒకేసారి మొత్తం రుణం మాఫీ చేస్తామని ఇలా కాలయాపన చేసుడేంది. అప్పుడు కేసీఆర్ అట్ల చేయలేదు కదా.., ఎవరి అప్పు వాళ్లకే మాఫీ చేసిండు. ఇప్పుడు కూడా అట్లనే చేయాలె.
– శీర్ల రాజేశ్వర్‌రావు, రామకృష్ణాపూర్(వి)
రుణమాఫీ కాలేదు..
ములుగు, జూలై 19 (నమస్తేతెలంగా ణ): నేను ములుగులోని కెనరా బ్యాంకు లో 2020లో రూ. 20 వేలు వ్యవసాయ రుణం తీసుకున్నా. రుణమాఫీ వివరాలు తెలుసుకునేందుకు బ్యాంకుకు వెళ్తే.. నీకు రుణమాఫీ కాలే దు.. వడ్డీతో కలిపి రూ.31వేలు కట్టమంటున్నరు. ఏడాది కిందటనే అప్పు కడుదామని బ్యాంకుకు వెళ్తే అధికారులు మాఫీ అవుతుందని చెప్పడంతో కట్టలేదు. ఇప్పుడు రుణమాఫీలో నీ పేరు లేదంటున్నరు. ఇప్పటికిప్పుడు రూ.31వేలు కట్టలేనని బ్యాంకు వాళ్లకు చెబితే మరో నాలుగు రోజులు చూద్దాం.. ఎవరిని అడగాలో, ఏం చేయాలో అర్థంకావడం లేదు.
– మూడ్ జీవన్‌లాల్, రంగారావుపల్లి, ములుగు
రెన్యువల్‌కు పైసలియ్యాల్నట
మహబూబాబాద్ రూరల్: నాకు రూ. 69వేల రుణం మాఫీ అయిందని చెప్పిం డ్రు. రుణం మాఫీ కావాలంటే రెన్యువల్‌కు రూ.3,400 బ్యాంకులో కట్టమంటున్నరు. రుణం మా ఫీ అయిన తర్వాత ఎందుకు కట్టాలంటే అధికారుల దగ్గర సమాధానం లేదు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం బ్యాంకర్లకు సరైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో చాలామందికి అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందిం చి రైతులకు ఇబ్బంది కలుగకుండా రుణమాఫీపై బ్యాంకులకు సరైన సూచనలు ఇవ్వాలి. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది.
– గొర్రె పూలమ్మ, జమాండ్లపల్లి
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

