విధి వంచితులు!
వారు విధి వంచితులు.. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు వారి వి. కూలికి పోతేనే నాలుగు మెతుకులు..లేకుంటే పస్తులే అన్నట్లుగా వారి జీవనం సాగుతున్నది. కాయ కష్టం చేసి కుటుంబాలను పోషించుకుంటూ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వారి జీవితాలను విధి వక్రీకరించింది. పక్షవాతంతో ఇంటి పెద్దలు మంచానికే పరిమితం కాగా, వారి భార్యలు కూలీనాలి పనులు చేసుకుంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు.
- ప్రభుత్వ పింఛన్ కోసం ఎదురుచూపులు
- పక్షవాతంతో భర్తలు మంచానికే పరిమితం
- కూలీనాలి చేసి కుటుంబాలను సాకుతున్న భార్యలు
- దివ్యాంగుల పింఛన్ కోసం నాలుగేళ్లుగా నిరీక్షణ
- సర్కారు కనికరం చూపాలని వేడుకోలు
స్టేషన్‌ఘన్‌పూర్, మే18 : వారు విధి వంచితులు.. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు వారి వి. కూలికి పోతేనే నాలుగు మెతుకులు..లేకుంటే పస్తులే అన్నట్లుగా వారి జీవనం సాగుతున్నది. కాయ కష్టం చేసి కుటుంబాలను పోషించుకుంటూ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వారి జీవితాలను విధి వక్రీకరించింది. పక్షవాతంతో ఇంటి పెద్దలు మంచానికే పరిమితం కాగా, వారి భార్యలు కూలీనాలి పనులు చేసుకుంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. వికలాంగుల పింఛన్ వస్తే మందులకైనా పని చేస్తాయని పింఛన్ కోసం దరఖాస్తు చేసుకొని నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారు జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడం గ్రామానికి చెందిన మేకల వెంకటయ్య, ఉప్పలమ్మ, గంగారపు రమ, రమేశ్ దంపతులు. మేకల వెంకటయ్య, ఉప్పలమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతు రు ఉన్నారు.
మేకలు సాకడమే వృత్తిగా ఉన్న వీరు పదేళ్ల క్రితమే పిల్లల పెండ్లిళ్లు చేయగా, వారు హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ అక్కడే ఉం టున్నారు. నాలుగేళ్ల క్రితం వెంకటయ్యకు పక్షవా తం రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. అతడి భార్య ఉప్పలమ్మ కూలీ పనులు చేసుకుం టూ భర్తను పోషించుకుంటున్నది. రెండేళ్లుగా ఉప్పలమ్మ కూడా నడుంనొప్పి రావడంతో కూలీ పనులకు వెళ్లే పరిస్థితి లేక కుటుంబ పోషణ భారంగా మారింది. వీరి మంచి చెడులను చూసే ఆర్థిక స్థోమత పిల్లలకు లేకపోవడంతో వారు బతకడం భారంగా మారింది. ప్రభుత్వం ఇచ్చే దివ్యాంగుల పింఛన్ వస్తే మందులకైనా పని చేస్తాయని నాలుగుసార్లు దరఖాస్తు చేసినా పింఛన్ రావడం లేదని, ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని ఆ దంపతులు తెలిపారు. సదరం సర్టిఫికెట్ల గడువు ముగుస్తుంది.. కానీ గడపలోకి పథకాలు రావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పింఛన్ రావడం లేదు..
మా ఆయన నాలుగేండ్ల క్రితం పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమైండు. ఇంట్లకు ఎల్లక నానా కష్టాలు పడుతున్నాం. పింఛన్ కోసం దరఖాస్తు చేయడానికి సదరం సర్టిఫికెట్ల కోసం ఆటోలో జనగామకు నాలుగు సార్లు పోతే రూ.4వేల వరకు ఖర్చయింది. నాలుగుసార్లు దరఖాస్తు చేసినా ఇప్పటి వరకు పింఛన్ మంజూరు కాలేదు. మా ఆయనకు మందులకు నెలకు రూ.5వేల వరకు ఖర్చవుతున్నయి. ఇటు మందులకు, అటు తిండికి ఇబ్బంది పడుతున్నం. నాకు నడుం నొప్పి ఉండడంతో కూలి పనులు చేయలేకపోతున్న. ఉన్న చిన్న ఇల్లు కూడా కూలిపోవడంతో కిరాయికి ఉంటున్నం. మొదట మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశాక, మళ్లీ రద్దు చేశారు. ప్రభుత్వం స్పందించి పెన్షన్ అందించి ఆదుకోవాలి, లేకుంటే మాకు చావే గతి.
– ఉప్పలమ్మ, మేకల వెంకటయ్య భార్య
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

