గోదావరి జలాలు సీఎం కేసీఆర్ చలవే
సీఎం కేసీఆర్ చొరవతో కరువు ప్రాంతమైన జనగామ నియోజకవర్గంలో గోదారమ్మ పరుగులు పెడుతున్నదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ఇన్‌టెక్ వెల్ టు తపాస్‌పల్లి రిజర్వాయర్ వరకు రూ.388 కోట్ల వ్యయంతో నిర్మించే భూగర్భ జలమార్గం, ఓపెన్ కెనాల్ పనులను సోమవారం టీఆర్ఎస్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. కెనాల్ నిర్మాణంతో భూమి కోల్పోతున్న రైతులు స్వయంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి
- సీఎం చొరవతో జనగామ నియోజకవర్గం సస్యశ్యామలం
- రూ.388 కోట్లతో భూగర్భ జలమార్గం, కాల్వల నిర్మాణం
- ఇక సాగు, తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
- భూములిచ్చిన రైతులకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పాదాభివందనం
- ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
- మల్లన్నసాగర్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం
చేర్యాల, సెప్టెంబర్ 5 : సీఎం కేసీఆర్ చొరవతో కరువు ప్రాంతమైన జనగామ నియోజకవర్గంలో గోదారమ్మ పరుగులు పెడుతున్నదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ఇన్‌టెక్ వెల్ టు తపాస్‌పల్లి రిజర్వాయర్ వరకు రూ.388 కోట్ల వ్యయంతో నిర్మించే భూగర్భ జలమార్గం, ఓపెన్ కెనాల్ పనులను సోమవారం టీఆర్ఎస్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. కెనాల్ నిర్మాణంతో భూమి కోల్పోతున్న రైతులు స్వయంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మిఠాయిలు తినిపించి, జై కేసీఆర్.. జై టీఆర్ఎస్.. అని నినాదాలు చేశారు. అనంతరం మల్లన్నసాగర్ టు తపాస్‌పల్లి ఇన్‌టేక్ వెల్ వద్ద ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. తపాస్‌పల్లికి జలాలు వచ్చే అండర్‌గ్రౌండ్ టన్నెల్ పనులు తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా తపాస్పల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ర్టాల రైతులు కేసీఆర్ ప్రధాని కావాలని స్వాగతిస్తున్నారని, దేశాభివృద్ధి కోసం తప్పక నాయకత్వం వహించాలని కోరారు. కరువున్న చోటే రిజర్వాయర్లు నిర్మిస్తున్న సీఎం కేసీఆర్ ముందుచూపు, మేధోశక్తిని చూసి భారత రైతాంగం అబ్బురపడుతున్నదని తెలిపారు.
ఈ పరిణామం బీజేపీ అధినేత వెన్నులో వణుకు మొదలైందన్నారు. నిత్య కరువు ప్రాంతమైన జనగామ ప్రజలకు సాగు నీరు, తాగు నీరు అందించేందుకు సీఎం కేసీఆర్ రూ.388 కోట్లు మంజూరు చేయడంతో పాటు పనులు సైతం ప్రారంభించినట్లు తెలిపారు. తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీటిని పంపింగ్ చేసేందుకు 640 ఎకరాల భూమి అవసరమైందని, అందులో ఎక్కువ భాగం గజ్వేల్ నియోజకవర్గంలో ఉందన్నారు. రైతులు ఎక్కువ భూములు కోల్పోకుండా ఉండేందుకు భూగర్భంలోనే టన్నెల్ నిర్మించనున్నట్లు తెలిపారు. మల్లన్నసాగర్-తపాస్‌పల్లి లింకేజీతో నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో గోదావరి జలాలలు అందడంతో పాటు గజ్వేల్, సిద్దిపేట, ఆలేరు, భువనగిరి, మేడ్చల్ నియోజకవర్గాలకు సైతం కొంతమేరకు సాగు, తాగు నీరు అందించనున్నట్లు ముత్తిరెడ్డి పేర్కొన్నారు. తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీరు రానుండడంతో ఇక దేవాదుల నుంచి వచ్చే నీటిని జనగామ జిల్లా నర్మెట, తరిగొప్పుల రైతుల అవసరాల మేరకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఐదున్నర కిలోమీటర్ల మేరకు 20 మీటర్ల డయాతో అండర్‌గ్రౌండ్ కాల్వల నిర్మాణంతో పాటు తపాస్‌పల్లి సమీపంలో కిలోమీటర్ మేరకు ఓపెన్ కెనాల్ నిర్మించనున్నట్లు తెలిపారు. ఆరు నియోజకవర్గాలకు ఉపయోగపడేలా సీఎం కేసీఆర్ డిజైన్ చేశారని, పారే నదిని రివర్స్‌లో పారిస్తున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు. నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయించేందుకు సర్కారు అన్ని చర్యలు తీసుకుంటున్నదని, నిత్యం పనికిమాలిన విమర్శలు చేసే ప్రతిపక్ష పార్టీలు ఇక్కడకు వచ్చి, ఏమి జరుగుతుందో చూసి మాట్లాడితే బాగుంటుందన్నారు. రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
జనగామ నియోజవకర్గం సస్యశ్యామలం అయ్యేందుకు నిధులు మంజూరు చేసి, పనులకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గుజ్జ సంపత్‌రెడ్డి, ఎంపీపీలు బద్దిపడిగె కృష్ణారెడ్డి, వుల్లంపల్లి కరుణాకర్, తలారీ కీర్తనాకిషన్, జడ్పీటీసీలు మల్లేశం, సిద్ధప్ప, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశంగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ స్వరూపారాణి, వైస్ చైర్మన్ రాజీవ్‌రెడ్డి, మల్లన్న ఆలయ మాజీ చైర్మన్ గీస భిక్షపతి, మండలాల అధ్యక్షులు అనంతుల మల్లేశం, మేక సంతోష్, మంద యాదగిరి, టౌన్ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వర్రావు, రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల్‌నర్సయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం చేర్యాలలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

