వర్ధన్నపేట, జనవరి 5 : నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీకి స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డు దక్కింది. కేంద్ర ప్రభుత్వం 15వేల జనాభా కలిగిన మున్సిపాలిటీల విభాగంలో వర్ధన్నపేటను ఎంపిక చేసింది. మంత్రి కేటీఆర్ గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమినర్ గొడిశాల రవీందర్‌కు అవార్డు అందజేశారు. కాగా, మూడు సంవత్సరాల కిత్రమే వర్ధన్నపేటను తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీగా మార్చి, అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.30 కోట్లు నిధులను మంజూరు చేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ నేతృత్వంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రమైనప్పటికీ గత పాలకులు పట్టించుకోక పోవడంతో అనుకున్న మేర అభివృద్ధి జరుగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, దయాకర్‌రావు సహకారంతో ఎమ్మెల్యే పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నారు.