క్రిస్మస్త్
ప్రపంచానికి శాంతి సందేశం వినిపించి ప్రేమను పంచిన ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ వేడుక లను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమవారం క్రైస్తవులు చర్చిలకు వెళ్లి ఆనందో త్సాహాల మధ్య పండుగను జరుపుకొన్నారు.
- ఉమ్మడి జిల్లాలో ఘనంగా ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు
- ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకొన్న క్రైస్తవులు
- చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు
- కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు
- క్రీస్తు సందేశం వినిపించిన పాస్టర్లు
- పాల్గొన్న మంత్రులు, ఎమ్యెల్యేలు, ప్రజాప్రతినిధులు
ప్రపంచానికి శాంతి సందేశం వినిపించి ప్రేమను పంచిన ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ వేడుక లను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమవారం క్రైస్తవులు చర్చిలకు వెళ్లి ఆనందో త్సాహాల మధ్య పండుగను జరుపుకొన్నారు. కేక్ కటింగ్ చేసి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఏసు ప్రభువును కొలుస్తూ పాటలు పాడారు. పాస్టర్లు, మత పెద్దలు ఏసుక్రీస్తు శాంతి సందేశాన్ని వినిపించారు. ఆయన చూపిన మార్గంలో నడవాలని సూచించారు. చర్చిల వద్ద క్రిస్టియన్లు సరదాగా సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

హనుమకొండలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి, కాజీపేట ఫాతిమా నగర్‌లోని కెథడ్రల్, కరు ణాపురంలోని క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరం, డోర్నకల్‌లోని సీఎస్ఐ, యశ్వంతాపూర్‌లోని షాలోమీ బాప్టిస్టు, తదితర చర్చిల్లో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వరంగల్ నగరంలో మంత్రి కొండా సురేఖ, ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పాల్గొనగా, ఆయా చర్చిల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.
– నమస్తే నెట్వర్క్, డిసెంబర్ 25
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

