సముద్రంలోకి జలాలు సర్కారు మల్లగుల్లాలు
కాలం అనుకూలించక ఇప్పటికే వర్షాలు ఆలస్యంగా మొదలై రైతులు సాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షానికి తోడు ప్రాణహిత నుంచి మేడిగడ్డకు వరద పోటెత్తి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నా వినియోగించుకునేందుకు కాంగ్రెస్ సర్కారు మల్లగుల్లాలు పడుతున్నది.
- మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు
- వినియోగించుకునే అవకాశం ఉన్నా స్పందించని వైనం
- నేడు కేటీఆర్ నేతృత్వంలో బరాజ్‌కు బీఆర్ఎస్ బృందం
కాలం అనుకూలించక ఇప్పటికే వర్షాలు ఆలస్యంగా మొదలై రైతులు సాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షానికి తోడు ప్రాణహిత నుంచి మేడిగడ్డకు వరద పోటెత్తి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నా వినియోగించుకునేందుకు కాంగ్రెస్ సర్కారు మల్లగుల్లాలు పడుతున్నది. గోదావరి, మానేరు వాగుల నుంచి నీటి లభ్యత అంతగా లేకపోయినా కేసీఆర్ ముందుచూపుతో ఎక్కువ వరద ఉండే మేడిగడ్డ ప్రాంతంలో బరాజ్ నిర్మించగా ప్రస్తుతం నాలుగు మోటర్ల ద్వారా పంపింగ్ చేసి సాగు, తాగునీరు అందించే ఆస్కారమున్నా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డను సందర్శించి, బరాజ్ అవశ్యకతను, సర్కారు నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించనున్నది.
– జయశంకర్ భూపాలపల్లి, జూలై 25 (నమస్తే తెలంగాణ)
జయశంకర్ భూపాలపల్లి, జూలై 25 (నమస్తే తెలంగాణ) : గోదావరి, మానేరు వరద అంతగా లేకున్నా ప్రాణహిత పరవళ్లు తొక్కుతున్నది. రోజుకు 10 టీఎంసీల నీరు మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్ నుంచి దిగువకు ప్రవహిస్తున్నది. ప్రస్తుతం గోదావరి, మానేరు నుంచి 15వేల క్యూసెక్కుల వరద మాత్రమే అన్నారం (సరస్వతి) బరాజ్ నుంచి మేడిగడ్డకు వస్తున్నది. వృథాగా పోతున్న నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రాణహిత నుంచి వరద ఎక్కువగా వచ్చే ప్రదేశాన్ని ముందే గుర్తించిన కేసీఆర్ మేడిగడ్డ వద్ద 16.17 టీఎంసీల సామర్థ్యంతో బరాజ్‌ను నిర్మించినట్లు ఇంజినీర్లు చెపుతున్నారు. మేడిగడ్డలో మొత్తం 85 గేట్లు ఎత్తిపెట్టగా రోజుకు 10 టీఎంసీల నీరు దిగువకు వెళ్తున్నదని, దీనివల్ల బరాజ్ ఆవశ్యకత ఎంతన్నది అవగతమవుతున్నదని వారు పేర్కొంటున్నారు.
తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత అంతగా ఉండదని భావించే మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించినట్లు చెపుతున్నారు. గతేడాది మేడిగడ్డ బరాజ్‌కు 24 లక్షల క్యూసెక్కుల ప్రాణహిత వరద వచ్చేదని, ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కులు వస్తున్నదన్నారు. ఈ నీటిని కనీసం నాలుగు మోటార్ల ద్వారా పంపింగ్ చేస్తే రైతులు, ప్రజలకు సాగు, తాగు నీటి తిప్పలు తప్పేవని ఇరిగేషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వం నీటి పంపింగ్‌కు అనుమతివ్వాలని ఎన్డీఎస్ఏ చుట్టూ తిరుగుతున్నదనే విమర్శలున్నాయి. వారం రోజుల్లో ఎన్డీఎస్ఏ బృందం రానుందని సమాచారం.
నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం
శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల బృందం మేడిగడ్డకు రానుంది. రామగుండం నుంచి బయలుదేరి ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకుంటారు. అక్కడి మోటార్లు పంపింగ్‌కు సిద్ధంగా ఉన్నాయా? గ్రావిటీ కాల్వలు దెబ్బతిన్నాయా? అనేది పరిశీలిస్తారు. మోటార్లు సిద్ధంగా ఉన్నా, పెద్ద మొత్తంలో నీరు వృథాగా పోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నీటిని పంపింగ్ చేయడం లేదనే విషయాలపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ప్రజలకు క్లారిటీ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టనున్నారు. ఆ తర్వాత ఉదయం11 గంటలకు మేడిగడ్డకు చేరుకొని బరాజ్‌ను, వృథాగా పోతున్న ప్రాణహిత నీటిని పరిశీలించి చెన్నూరుకు వెళ్తారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

