హనుమకొండ, డిసెంబర్ 2 : అన్యాయం జరిగిన వారికి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. కేసీఆర్ దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా 4వ రోజు మంగళవారం ‘తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర’ అనే అంశంపై మంగళవారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాల యంలో న్యాయవాదులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలం గాణకు అన్యాయం జరుగుతున్నదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నాడు న్యాయవాదులు ముందుండి కొట్లాడారన్నా రు.
ఉద్యమకారుల తర ఫున కేసులు వాదించి చేదోడువాదోడుగా నిలిచారని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కోర్టు ఆవరణలో సైతం ఉద్యమాలు నడిపిన ఘనత న్యా యవాదులకే దకుతుందన్నారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత న్యాయవాదుల సంక్షేమానికి నిధులు, నూతన కోర్టుల ఏర్పాటు, కోర్టుల్లో మౌలిక వసతులను కల్పించామని తెలిపారు. న్యాయవాద వృత్తి నుంచి వచ్చిన తన లాంటి ఎందరికో కేసీఆర్ రాజకీయ అవకాశాలు సైతం ఇచ్చారని అన్నారు. ఉద్యమ స్ఫూర్తితో రానున్న మూడేళ్లు బీఆర్ఎస్కు అండగా న్యాయవాదులు ఉండాలని వినోద్‌కుమార్ కోరారు.
వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. ఉద్యమంలో న్యాయవాదుల పోరాటం గొప్పదని, వారి కృషి మరువలేనిదని అన్నారు. గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ శ్రేణులపై నమోదవుతున్న తప్పుడు కేసులను కోర్టుల్లో వాదించి, గెలిచి వారి కుట్రలను ఛేదిస్తున్నారని తెలిపారు. లగచర్ల రైతులు, ఫార్మా రైతులు, ట్రిపుల్ ఆర్ బాధితులు, హైడ్రా బాధితులు ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ఏ వర్గానికి అన్యాయం చేసినా వారు బీఆర్ఎస్ పార్టీనే ఆశ్రయిస్తున్నారని, వారి తరఫున బీఆర్ఎస్ పార్టీ, మన లీగల్‌సెల్ పోరాడుతున్నదన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ వంటి వారిపై తప్పుడు కేసులు నమోదైతే కోర్టుల్లో వాదనలు వినిపించి కాపాడుతున్నదన్నారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల బీఆర్ఎస్ లీగల్ సెల్ గౌరవ అధ్యక్షుడు సహోదర్‌రెడ్డి, జనార్దన్‌గౌడ్, శ్యామ్‌సుందర్, లీగల్‌సెల్ బాధ్యులు శివరాజ్, నాయిని రవి, శ్రీరామ్ కిరణ్, అంజయ్య గౌడ్, వసంత్యాదవ్ పాల్గొన్నారు.