అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్ ఎజెండా
తొమ్మిదిన్నరేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అస్త్రాలుగా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు ప్రతి గడపకూ మ్యానిఫెస్టోను చేరుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. 2014కు ముందు, ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.
- ఎన్నికల ప్రచారంలో ప్రధాన నినాదం ఇదే..
- ప్రగతిపై ప్రజలకు వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు..
- ప్రజల ఆదరణతో అభ్యర్థుల దూకుడు
- అయోమయంలో ప్రతిపక్షాలు
- ప్రచార అంశాలు లేక ఇబ్బందులు
- ఏం చెప్పి ఓట్లు అడగాలో తెలియక బేజారు
- ఆ పార్టీల అభ్యర్థులు, కార్యకర్తల్లో నైరాశ్యం
తొమ్మిదిన్నరేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అస్త్రాలుగా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు ప్రతి గడపకూ మ్యానిఫెస్టోను చేరుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. 2014కు ముందు, ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందిన అన్ని వర్గాల వారు బీఆర్ఎస్ను ఆదరిస్తున్నారు. కారు గుర్తుకే ఓటు వేస్తామని, అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. దీంతో ప్రతిపక్ష నాయకుల్లో అయోమయం నెలకొన్నది. ప్రచార అంశాలు లేక, ఏం చెప్పి ఓట్లు అడగాలో తెలియక రాష్ట్ర సర్కారు, బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రచారం కానిస్తున్నారు. అయితే ఈ విమర్శలపై ప్రజల నుంచి ఏ స్పందనా రాకపోవడంతో ఆ పార్టీల కార్యకర్తలు నైరాశ్యంలో పడ్డారు.
– వరంగల్, నవంబర్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, నవంబర్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లుగా చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అభ్యర్థులు ప్రజలకు వివరిస్తున్నారు. ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెం ట్, ఓవర్సీసిస్ స్కాలర్షిప్స్, న్యూట్రిషన్ కిట్, ఉచిత చేప పిల్లలు, గొర్రెల పంపిణీ, సెలూన్లు-దోభీఘాట్లకు సబ్సిడీ కరెంటు, దళితబంధు, డబుల్‌బెడ్ రూం, గురుకులాల్లో ఉచిత విద్య ఇలా దేశంలోనే ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయి. అందుకే తెలంగాణ ఇప్పుడు సంక్షేమంలో దేశానికి దిక్సూచిగా నిలిచింది. ఈ పథకాల అమలు తీరును వివరిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో ముందుంటున్నారు. బీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దీటుగా ఏం చెప్పాలో తెలియక కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలను ఎలా మద్దతు కోరాలో తెలియక అయోమయంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం, నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. విమర్శలపై ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంటున్నది.
సమగ్రంగా సంక్షేమం..
బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లుగా అన్ని వ ర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నది. రైతు బంధు కింద ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్నది. వానకాలంలో జిల్లాలో 1,37,995 మంది రైతులకు రూ.132 కోట్లు, యాసంగిలో 1,35,859 మందికి రూ.132 కోట్లను బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది. రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం కింద ఏడాదిలో సగటున రూ.12 కోట్లను ప్రభుత్వం రైతు కు టుంబాలకు ఇస్తున్నది. వరి పంటకు కనీస మద్దతు ధ ర కల్పించే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా 155 కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనుగోలు చేస్తున్నది. వానకాలం, యాసంగి కలిపి ఏటా రూ.300 కోట్లతో లక్షన్నర ట న్నుల వడ్లను కొంటున్నది. దీంతో సగటున 36 వేల మంది రైతులకు మేలు జరుగుతున్నది. ప్రతి ఎకరా సాగుకు యోగ్యంగా ఉండేందుకు వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇస్తున్నది. జిల్లాలోని దాదాపు 50 వేల మోటర్లకు నిరంతరం ఉచిత కరెంటు అందిస్తున్నది. దీని కోసం ఏటా రూ.167 కోట్లను ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తున్నది. జిల్లాలోని రెండు మార్కెట్ల కమిటీల్లోని వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం 20 వేల టన్నుల సామర్థ్యం కలిగిన ఐదు గోదాములను ప్రభుత్వం ని ర్మించింది. జిల్లాలోని 1,068 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14.43 కోట్లతో ఈ ఏడాది సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేసింది. ఉచిత చేప పిల్లల పం పిణీ కింద 419 చెరువులలో 78లక్షల చేప పిల్లలు, 7.63లక్షల రొయ్య పిల్లలు వదిలింది. 5,311 టన్నుల చేపలు, రెండు టన్నుల రొయ్యల ఉత్పత్తి వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే 532 స్కూళ్లలో చదవే 42,302 మంది పిల్లలకు నాణ్యమైన సన్న బియ్యంతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. 6,235 మంది గిరిజన విద్యార్థులకు పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్స్ కింద రూ.22.19 కోట్లు, బెస్ట్ అవైలబుల్ స్కీం కింద మరో రూ.86 లక్షల సాయం అందించింది. బీసీ వర్గానికి చెందిన 53,212 మంది విద్యార్థులకు పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్స్ కింద రూ.21.85 కోట్లను ఇచ్చింది. 40,608 మంది విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.57.58 కోట్లను ఖర్చు చేసింది. 2,545 మంది ఈబీసీ విద్యార్థుల కోసం రూ.8.23 కోట్లను అందజేసింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద జిల్లాలోని 16 మంది ఎస్సీ విద్యార్థులు, 17 మంది మైనారిటీ విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.6.60 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పెన్షన్లను ఇస్తున్నది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత-చేనేత-బీడీ కార్మికులు, బోదకాలు-ఎయిడ్స్ బాధితులకు ప్రతి నెలా రూ.2,016 చొప్పున, దివ్యాంగులకు రూ.3,016 చొప్పున ఇస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 87,421 మందికి రూ.19.53 కోట్లను ఆసరా పెన్షన్ల రూపంలో ప్రభుత్వం చెల్లిస్తున్నది. దళిత సాధికారత కోసం ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని మొదలుపెట్టింది. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 4149 మందికి ఒక్కొక్కరికి రూ.9.90 లక్షల చొప్పున రూ.410.70 కోట్లు ఇచ్చింది. నాయీ బ్రాహ్మణులు, రజకులకు 257 యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది.
రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ఆడపిల్లల పెండ్లి కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఇస్తున్నది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరుతో ఆడపిల్లల పెండ్లి కోసం ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున అందజేస్తున్నది. దివ్యాంగులైన ఆడపిల్లలకు రూ.1,25,145 చొప్పున ఇస్తున్నది. ప్రతి ఏటా సగటున 5,136 మందికి రూ.47.73 కోట్ల చొప్పున అందిస్తున్నది. జిల్లాలోని మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టులు, 788 అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో 21,920 మందికి చిన్నారులు, 2,513 మంది గర్భిణులు, 2,232 మంది బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనాన్ని సమకూర్చుతున్నది. బాల రక్ష భవన్ కింద 255 కుటుంబాలకు నిత్యావసర సరుకులను ఇస్తున్నది. జిల్లాలోని 6115 మహిళా సంఘాలకు రూ.306.53 కోట్ల బ్యాంకు లింకేజీ రూపంలో ప్రభుత్వం అందించింది. ప్రతి ఏటా ఇంతే మొత్తంలో ఈ రుణాలు అందుతున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో అధునాతన వైద్య సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రూ.67 లక్షలతో మిల్క్ బ్యాంకు, రూ.33 లక్షలతో బ్లడ్ బ్యాంకును ప్రారంభించింది. రూ.1.20 కోట్లతో టీ-డయాగ్నస్టిక్ హబ్, రేడియాలజీ ల్యాబ్ భవనాల నిర్మాణం పూర్తయింది. రూ.11 కోట్లతో 74 ఆరోగ్య ఉప కేంద్రాలకు భవనాల నిర్మాణ ప్రక్రియ మొదలైంది. నిరుపేదలకు సౌకర్యవంతమైన ఇండ్లను నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని మొదలుపెట్టింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు జిల్లాకు 5,091 ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో 1,381 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. ఈ ఏడాది చివరి వరకు అన్ని ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

