సమస్యల బడి
చిన్న వానకే జలమయమయ్యే పాఠశాల ఆవరణ, అధ్వానంగా పారిశుధ్యం, పెచ్చులూడుతున్న తరగతి గదులు, అమలుకాని సీఎం బ్రేక్‌ఫాస్ట్, పత్తాలేని రెండో జత యూనిఫాం, ఏడు నెలలుగా పెండింగ్‌లో మధ్యాహ్న భోజనం, కోడిగుడ్ల బిల్లులు, వేతనాలు అందక ఐఈఆర్పీల ఇబ్బందులు, ప్రాథమిక పాఠశాలల్లో భర్తీ కాని ఎస్జీటీ పోస్టులు..
- పాఠశాలల నిర్వహణ పట్టని సర్కారు
- నిర్లక్ష్యపు నీడలో చదువులు
- విద్యార్థులకు తప్పని అవస్థలు
- అటకెక్కిన పారిశుధ్యం
- పెండింగ్‌లో మధ్యాహ్న భోజన బిల్లులు
- సీఎం బ్రేక్‌ఫాస్ట్‌కు బ్రేక్
- ఒక జత యూనిఫామే దిక్కు
- ఖాళీగా ఎస్జీటీ పోస్టులు
- ఐఈఆర్పీలకూ అందని వేతనాలు
చిన్న వానకే జలమయమయ్యే పాఠశాల ఆవరణ, అధ్వానంగా పారిశుధ్యం, పెచ్చులూడుతున్న తరగతి గదులు, అమలుకాని సీఎం బ్రేక్‌ఫాస్ట్, పత్తాలేని రెండో జత యూనిఫాం, ఏడు నెలలుగా పెండింగ్‌లో మధ్యాహ్న భోజనం, కోడిగుడ్ల బిల్లులు, వేతనాలు అందక ఐఈఆర్పీల ఇబ్బందులు, ప్రాథమిక పాఠశాలల్లో భర్తీ కాని ఎస్జీటీ పోస్టులు.. ఇలా సర్కారు బడిని అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు అంతులేని నిర్లక్ష్యంతో పాఠశాలల నిర్వహణను గాలికి వదలేయడం విద్యార్థులకు, నిర్వాహకులకు ఇబ్బందిగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దే విద్యాశాఖ ఉన్నప్పటికీ సమస్యలను పట్టించుకోకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయమై మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాయడం అంతటా చర్చనీయాంశమైంది.
-జయశంకర్ భూపాలపల్లి, జూలై 9(నమస్తే తెలంగాణ)
బ్రేక్ ఫాస్ట్ కొనసాగించాలి
పెద్దవంగర, జూలై 9 : గతంలో పాఠశాలల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్‌ను ప్రవేశ పెట్టడంతో మాలాంటి నిరుపేద విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేది. పెద్దవంగర ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రావాలంటే ఉదయం ఉప్పరగూడెం గ్రామం నుంచి కాలినడకన, సైకిళ్లపై రావాలి. ఇప్పుడు పదో తరగతి చదువుతున్నాం. మరికొద్ది రోజుల్లో ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ ఉంటాయి. ఇంటి వద్ద తినిరావడం కష్టంగా ఉంటుంది. దీంతో చదువు మీద ఏకాగ్రత పోతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్‌ను కొనసాగించాలి.
-పెద్ది సాయి చేతన్, పదో తరగతి విద్యార్థి, పెద్దవంగర ఉన్నత పాఠశాల
బంగారం కుదువ పెట్టినం
స్ట్టేషన్ ఘన్పూర్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి పెట్టిన పెట్టుబడికి మిత్తి కూడా రావడం లేదు. మేం వంట చేసే పాఠశాలలో సుమా రు 261 మంది విద్యార్థులున్నా రు. వారికి రోజుకు రూ. 1300 వరకు ఖర్చు వస్తున్నది. కోడిగుడ్లు పెట్టిన రోజు రూ. వేయి అదనంగా అవుతున్నయి. నెలకు సుమారు రూ. 50 వేల వరకు ఖర్చు వస్తుంది. పైసలు మాకు వచ్చే వరకు నాలుగు నెలలు పడుతున్నది. పెట్టుబడి కోసం కొందరం మూడు పైసలకు అప్పు తీసుకువస్తే, ఇంకొందరం బంగారం కుదువ పెట్టినం.
– పులి పద్మ, మధ్యాహ్న భోజన కార్మికురాలు, స్టేషన్ ఘన్పూర్
పెండింగ్‌లో గౌరవ వేతనాలు, మధ్యాహ్న భోజన బిల్లులు
భూపాలపల్లి జిల్లాలోని 410 పాఠశాలల్లో 711 మంది కుక్‌లు, హెల్పర్లు పనిచేస్తున్నారు. వారికి రాష్ట్రప్రభుత్వం రూ.2000, కేంద్రప్రభుత్వం రూ.1000 చొప్పున నెలకు రూ.3 వేలు గౌరవ వేత నం అందిస్తుంది. 711 మందికి నెలకు రూ. 21.33 లక్షలు గౌరవ వేతనాలు అందిస్తున్నారు. అయితే జనవరి నుంచి వీరికి గౌరవ వేతనం పెండింగ్‌లో ఉంది. అంటే రూ.1.27 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా అధికారులు మాత్రం రూ.30లక్షలు మంజూరయ్యాయని, త్వరలోనే అందిస్తామని చెబుతున్నారు. అలాగే తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు సంబంధించి నాలుగు నెలల మధ్యాహ్న భోజన, ఎగ్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒకటవ తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు రూ.46.73లక్షలు మధ్యాహ్న భోజన బిల్లులు, రూ.14.61 లక్షలు కోడిగుడ్ల బిల్లులు వచ్చాయని అధికారులు పేపర్ లెక్కలు చెబుతున్నా రు. కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులకు పాఠశాలలోనే అల్పాహారం అందించాలని సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో జిల్లాలోని 15 పాఠశాలల్లో పథ కం మొదటి విడతగా అమలు చేయగా సుమారు 800 మంది విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. ప్రస్తుతం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని సర్కారు బ్రేక్ చేసింది.
ఖాళీగా ఎస్జీటీ పోస్టులు
ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇచ్చిన నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఒక్క భూపాలపల్లి జిల్లాలోనే 250 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా డీఎస్సీ రిక్రూట్మెంట్ పూర్తయ్యేలోగా విద్యార్థులకు విద్యావాలంటీర్లచే విద్యాభోదన చేయించాలని తల్లిదండ్రు లు కోరుతున్నారు. సర్వశిక్షా అభియాన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ల(ఐఈఆర్పీ) వేతనాలు రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా లో 22 ఐఈఆర్పీ సాంక్షన్ పోస్టులు ఉండగా ప్రస్తుతం 19మంది పనిచేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1829 ఉపాధ్యాయ సాంక్షన్ పోస్టులకు 1404 మంది పని చేస్తుండగా 425 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఒకే జత యూనిఫాం దిక్కు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అధికారులు ఒక జత యూనిఫాం అందించి చేతులు దులుపుకొన్నారు. మొత్తం 20,923 జతల యూనిఫాంలు అందించా రు. భూపాలపల్లి మండలంలోని పాఠశాలల విద్యార్థులకు 3674, చిట్యాలలో 2033, గణపురంలో 1726, కాటారంలో 1939, మహదేవపూర్‌లో 237 9, మల్హర్‌లో 1596, మొగుళ్లపల్లిలో 1743, మహాముత్తారంలో 1942, పలిమెలలో 620, రేగొండలో 1865, టేకుమట్లలో 1406 జతల యూనిఫాం అం దించారు. రెండో జత బట్టలకు ఇప్పటికీ దిక్కు లేదు.
బిల్లులు ఎప్పుడు పడుతున్నయో తెల్వడం లేదు
ఖానాపురం, జూలై 9 : ఖానాపురం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నాను. మాకు రూ. 3 వేల గౌరవ వేతనం ఏప్రిల్ వరకు చెల్లించారు. మధ్యాహ్న భోజన బిల్లులు కూడా ఏప్రిల్ వరకు తీసుకున్నం. అయితే ప్రభుత్వం ఎప్పుడు బిల్లులు వేస్తుందో తెల్వడం లేదు. కోడిగుడ్ల బిల్లులు జనవరి వరకు ఇచ్చారు. కోడిగుడ్డుకు ప్రభు త్వం రూ.5 మాత్రమే చెల్లిస్తున్నది. బయట రూ.6 నుంచి రూ.6.50 వరకు ధర ఉంది. దీంతో మాకు ఏమీ మిగలడం లేదు. ప్రభుత్వం బిల్లులన్నీ ఒకేసారి చెల్లించాలి.
-నీలపొంగు కొమురమ్మ, మధ్యాహ్న భోజన కార్మికురాలు, ఖానాపురం
అప్పు చేసి భోజనం పెడుతున్నం
ప్రభుత్వం మధ్యాహ్న భోజనం బిల్లులు అందించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నం. ప్రభుత్వం కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేస్తుంది. అప్పులు చేసి మిగతా సరుకులు కొనుగోలు చేస్తున్నం. కోడిగుడ్డు బిల్లులు జనవరి వరకు మాత్రమే వచ్చాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, జూన్ నెలలకు రాలేదు. గత ప్రభుత్వం రూ.3 వేల గౌరవ వేతనం డిసెంబరు వరకు ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం జనవరి నుంచి ఇవ్వలేదు. కార్మికులకు రూ.10 వేల గౌరవ వేతనంతో పాటు కోడిగుడ్లు, వంట సరుకులు ప్రభుత్వమే సరఫరా చేయాలి.
– బాలెన వరలక్ష్మి, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు, గణపురం
పది నెలల నుంచి కోడిగుడ్ల బిల్లులు రావడం లేదు
ధర్మసాగర్, జూలై 9 : మేము ధర్మసాగర్ జడ్పీఎస్ఎస్ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండుతున్నం. ఈ పాఠశాలలో 9, 10వ తరగతులకు చెందిన వారికి కోడిగుడ్లు వారానికి మూడు చొప్పున పెట్టాం. వీటికి పది నెలల నుంచి బిల్లులు రాలేదు. సార్‌ను అడిగితే వస్తాయి అంటున్నడు. ఇంక ఎంతగనమని పెట్టుబడి పెట్టాలి. సార్లు మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. రూ. 3 వేల గౌరవ వేతనం కూడా రాలేదు. ముందుస్తుగా పెట్టుబడి పెట్టలేక ఇబ్బందులు పడుతున్నాం. మాకు ఇప్పటికైనా నెల నెలా బిల్లులు ఇవ్వాలి.
– ల్యాగ విజయ, స్ఫూర్తి మహిళా సంఘం సభ్యురాలు, ధర్మసాగర్
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

