కురవి, జూన్ 16 : కురవి మండల కేంద్రంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర జ్యేష్ఠ బహుళ పంచమి సోమవారం గ్రామ దేవత (బొడ్రాయి) ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. వార్షికోత్సవం సందర్భంగా ఉదయం బొడ్రాయి వద్ద ప్రత్యేక అలంకరణలు చేశారు. అనంతరం ప్రధాన అర్చకులు అప్పె రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో గ్రామదేవత (బొడ్రాయి) కార్యనిర్వహకులు
బుక్క వీరన్న – స్వాతి దంపతులు పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరపూజ, గోపూజ, స్వస్తివాచనము, స్థలశుద్ది కార్యక్రమం, మండపరాదనలు, హోమములు జరిపారు. తదనంతరం బొడ్రాయి దేవతకు భక్తులతచే జలాభిషేకములు, పూర్ణాహుతి, కుంభాభిషేకం, మహాదాశీర్వచనం నిర్వహించారు.
సహస్ర ఘటాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించి వార్షికోత్సవ పూజలను నిర్వహించారు. గ్రామస్తులు ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతాంగం పంటలు సమృద్ధిగా పండి రైతాంగం చల్లంగా ఉండేలా ఆశీర్వదించు తల్లి అంటూ పూజలు నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడాలని వేడుకున్నారు. కార్యక్రమంలో పూజారులు కౌశిక్ , పెనుగొండ మధు శర్మ, శివకార్తీక్, సతీష్, వివిధ పార్టీల నాయకులు నూతక్కి నర్సింహారావు, సాంబశివరావు, సంగెం భరత్, ఎర్ర నాగేశ్వరరావు, నారాయణ రాజేందర్ కుమార్, దైద భద్రయ్య, డాక్టర్ శరత్, కర్నం రాజన్న, కన్నె వెంకన్న తదితరులు పాల్గొన్నారు.