వాగు పారక సాగు సాగక
కళ్ల ముందే ఎండుతున్న పంటలను చూసి అన్నదాతల గుండెలు పగులుతున్నాయి. వాటికి ప్రాణం పోసి బతికించుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. సాగునీళ్ల కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
- నీళ్లు లేక ఆకేరు వాగు వెలవెల.. ఎండుతున్న వరి
ఎక్స్‌కవేటర్‌తో వాగులో గుంతలు.. గంటకు రూ.3వేలు ఖర్చు
పంటను కాపాండేందుకు భగీరథ ప్రయత్నం
తొమ్మిదేళ్లలో ఇంత కరువు చూడలేదంటున్న రైతులు
పంటలు ఎండి.. గుండెలు పగిలి..
నర్సింహులపేట, మార్చి 9 : కళ్ల ముందే ఎండుతున్న పంటలను చూసి అన్నదాతల గుండెలు పగులుతున్నాయి. వాటికి ప్రాణం పోసి బతికించుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. సాగునీళ్ల కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. నర్సింహులపేట మండలంలోని పలు గ్రామాల శివార్ల నుంచి పారే ఆకేరు వాగు ఈ సారి ఎండిపోయింది. చుక్క నీరు లేక వెలవెల బోతున్నది. వాగు ఆసరాగా చేసుకొని వేసిన యాసంగి వరి పంటలు నీళ్లు లేక ఎండిపోతుండగా, వాటిని కాపాడుకునేందుకు అరిగోస పడుతున్నారు. కౌసల్యదేవిపల్లి శివారులో వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం పూర్తిగా ఎండిపోవడంతో వరి చివరి దశలో ఉన్న వరికి నీళ్లు అందించడానికి రైతులు ఇబ్బందిపడుతున్నారు. భవిష్యత్‌లో నీళ్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో వాగులో గంటకు రూ.3వేలు ఖర్చు చేసి ఎక్స్కవేటర్ సాయంతో గుంతలు తవ్విస్తున్నారు. తొమ్మిదేళ్ల కాలంలో ఇంతటి కరువు పరిస్థితిని చూడలేదని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చేతికొస్తున్న వరి పంట కాపాడేందుకు ఆకేరు వాగులోకి ఎస్సారెస్పీ జలాలను వదలాలని కోరుతున్నారు.
నీటి కోసం అరిగోస పడుతున్నాం
నాలుగు నెలల నుంచి వాగులో నీరు లేక చేతికొచ్చిన పంటలను కాపాడేందుకు అరిగోస పడుతున్నాం. నలుగురం కలిసి తలా కొంత వేసుకుని వాగులో గుంత తీయిస్తున్నాం. వాగులో ఉన్న తుమ్మచెట్టు కింద నీడకు కూర్చొని ఒక వాటకు గంట చొప్పున ముగ్గురం వరికి నీళ్లు పారిస్తున్నం. 10రోజుల వరకైనా వాగులోకి నీరొస్తే పంట బతుకుతుంది. లేకపోతే కష్టమే.
– ఎర్పుల శ్రీరాం, రైతు, కౌసల్యదేవిపల్లి
కూలికి పోయిన పైసలతో గుంత తీయిస్తున్నా..
ఎకరంపావు పొలంలో నీరు పారించేందుకు చాలా ఇబ్బంది పడుతున్నా. వాగులో గుంత తీసేందుకు మిరపకాయలు ఏరబోయిన కూలి పైసలు తెచ్చి ఇచ్చిన. తొమ్మిదేళ్లలో ఎప్పుడూ వాగు ఎండిపోలే. వరి పంట కోసం ఇప్పటికే రూ.25వేలు ఖర్చు చేసిన. తీరా పొట్ట దశకు వచ్చే సరికి నీళ్లు అందక ఎండిపోతున్నది. పొత్తు మోటర్ కావడంతో అందరం తలా రూ.3వేలు వేసుకుని జేసీబీతో గుంత తీయించినం. వాగులోకి నీళ్లు వచ్చే విధంగా చూడాలె. లేకుంటే మా పంటలు ఎండిపోతాయి.
– ఎర్పుల బీబమ్మ, కౌసల్యదేవిపల్లి
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

