Constable Attack | వరంగల్ జిల్లా ఉర్సు గుట్టలో ఓ బీట్ కానిస్టేబుల్ మద్యం మత్తులో న్యూసెన్స్ చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదాడని తెలిసిందే. కాగా ఉర్సు గుట్ట వద్ద బెటాలియన్ కానిస్టేబుల్ మనోజ్‌పై దాడి చేసిన బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడ్డది. దాడిని తీవ్రంగా ఖండించిన వరంగల్ సీపీ ఎన్ శ్వేత బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. దీంతోపాటు బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఉర్సు గుట్ట వద్ద ఉన్న ఓ బార్లో మద్యం తాగి బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేస్తున్నాడని బార్ సిబ్బంది 112కి డయల్ చేసి ఫిర్యాదు చేయడంతో బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి వెంటనే బార్ వద్దకు వెళ్లాడని తెలిసిందే. బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి బెటాలియన్ కానిస్టేబుల్‌ను షర్ట్ వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పి చెంపపై కొట్టడంతో బెటాలియన్ కానిస్టేబుల్ తిరిగి సంతోష్ రెడ్డి చెంప చెళ్లుమనిపించాడు.
ఈ క్రమంలో బెటాలియన్ కానిస్టేబుల్‌ను సంతోష్ రెడ్డి, స్థానికులతో కలిసి లాఠీతో చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది.