బతుకమ్మ వేడుకలు ఊరూరా వైభవంగా సాగుతున్నాయి. ఐదో రోజైన బుధవారం ‘అట్ల బతుకమ్మ’ సందర్భంగా ఆడబిడ్డలు ఆడిపాడారు. పల్లెలు, పట్టణాల్లో చిన్నారులు, యువతులు, మహిళలు సాయంత్రం కాగానే వీధులు, కూడళ్ల వద్దకు చేరుకొని బతుకమ్మ పాటలకు అనుగుణంగా ఆడారు.
పలుచోట్ల యువతులు ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్ని ఉత్సాంగా నృత్యాలు చేశారు. ఇలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు ఆలయాలు, బతుకమ్మ కుంటలు వద్ద కోలాహలంగా నెలకొంది. మహబూబాబాద్‌లో జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో మంత్రి సత్యవతిరాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పాల్గొన్నారు.