బచ్చన్నపేట మే 6 : బచ్చన్నపేట మండలం బీజేపీ అధ్యక్షుడిగా నాగిరెడ్డిపల్లికి చెందిన సీనియర్ నాయకుడు బంగారు మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బంగారు కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలు, నాయకులు నూతన అధ్యక్షుడిగ మహేష్‌ను ఎన్నుకున్నారు. మహేష్ 2008 నుంచి ఏబీవీపీ కార్యకర్తగా, చేర్యాల కళాశాల అధ్యక్షుడిగా, ఏబీవీపీ బ్లాక్ ప్రతినిధిగా పనిచేయడంతోపాటు ప్రస్తుతం బచ్చన్నపేట మండలం బీజేవైఎం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
మండలంలో ఆయన పార్టీ కోసం చేస్తున్న సేవను గుర్తించి జిల్లా నాయకులు, మండల నాయకులు కలిసి మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు జిల్లా అధ్యక్షుడు రమేష్, మాజీ మండల అధ్యక్షుడు సద్ధి సోమిరెడ్డి, మండల నాయకులు చంద్రమౌళి, నగేష్, వెంకట్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని అన్ని గ్రామాల్లో మరింత విస్తృతంగా చేస్తానని హామీ ఇచ్చారు.