వరంగల్, డిసెంబర్ 8: గ్రేటర్ కార్పొరేషన్ పన్నుల విభాగంలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. అవినీతి ఆరోపణలు, లంచాలు తీసుకుంటూ ఆర్ఐలు ఏసీబీకి పట్టుబడడంతో పన్నుల విభాగంపై కమిషనర్ ప్రావీణ్య ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారిని ఇతర విభాగాలకు బదిలీ చేస్తూ కొత్త వారికి ఆర్ఐలుగా అవకాశం కల్పించారు. రెవెన్యూ అధికారుల(ఆర్వో)ను సైతం అంతర్గత బదిలీలు చేశారు. కాజీపేట సర్కిల్ పరిధిలో పని చేస్తున్న వారిని కాశీబుగ్గ సర్కిల్ పరిధిలోకి బదిలీ చేశారు. కాశీబుగ్గ పరిధిలో పని చేస్తున్న వారిని కాజీపేట సర్కిల్ పరిధిలోని బదిలీ చేశారు. ఆర్వోలకు అదనంగా అప్పగించిన ఆర్ఐ బాధ్యతలను రిలీవ్ చేశారు.
ఈ మేరకు గురువారం ఆర్ఐలను అంతర్గతంగా బదిలీ చేస్తూ కమిషనర్ ప్రావీణ్య ఉత్తర్వులు జారీ చేశారు. కాశీబుగ్గ సర్కిల్లో ఆర్ఐగా విధులు నిర్వర్తిస్తున్న సంజయ్‌కుమార్‌ను కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని ట్రెజరీకి బదిలీ చేశారు. ఆర్ఐ మేఘాను కాజీపేట సర్కిల్ కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్ విభాగానికి బదిలీ చేశారు. కాశీబుగ్గ సర్కిల్లో ఆర్ఐగా విధులు నిర్వర్తిస్తున్న విజయవర్ధన్‌ను ప్రధాన కార్యాలయంలోని హార్టికల్చర్ విభాగానికి బదిలీ చేశారు. కాజీపేట సర్కిల్ పరిధిలో ఆర్ఐగా పని చేస్తున్న అనిల్‌కుమార్‌ను కమిషనర్ సీసీగా బదిలీ చేశారు. కాజీపేట సర్కిల్లోని ఆర్ఐ సుఖధను ప్రధాన కార్యాలయంలోని ఇంజినీరింగ్ విభాగానికి బదిలీ చేశారు.
కాజీపేట సర్కిల్లో పని చేస్తున్న ఆర్ఐ రజితను ప్రధాన కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్ విభాగానికి బదిలీ చేశారు. కాజీపేట సర్కిల్ ఆర్ఐగా విధులు నిర్వర్తిస్తున్న బొట్ల రమేశ్‌ను ప్రధాన కార్యాలయంలోని లీగల్ విభానికి బదిలీ చేశారు. ఆర్ఐ సుష్మితను ప్రధాన కార్యాలయంలోని ప్రజారోగ్య విభాగానికి బదిలీ చేశారు. కాశీబుగ్గ సర్కిల్లో ఆర్ఐగా విధులు నిర్వర్తిస్తున్న సజ్జన్రాజ్ను ప్రధాన కార్యాలయంలోని హెల్త్ విభాగానికి బదిలీ చేశారు.
కొత్త వారికి ఆర్ఐలుగా అవకాశం
కొత్త వారికి ఆర్ఐలుగా అవకాశాలు దక్కాయి. ఇప్పటి వరకు ఆర్ఐలుగా పని చేసిన వారిని బల్దియాలోని పలు విభాగాలకు బదిలీ చేశారు. కాజీపేట టౌన్‌ప్లానింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ అసిస్టెంట్ విజయకుమార్‌ను కాశీబుగ్గ సర్కిల్ పరిధిలో ఆర్ఐగా బదిలీ చేశారు. ప్రజారోగ్య విభాగంలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సయ్యద్ సోహెల్‌ను కాశీబుగ్గ సర్కిల్లో ఆర్ఐగా పోస్టింగ్ ఇచ్చారు. హార్టికల్చర్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ అసిస్టెంట్ సునీల్‌కు కాశీబుగ్గ సర్కిల్లో ఆర్ఐగా పోస్టింగ్ ఇచ్చారు. ప్రజారోగ్య విభాగంలో జూనియర్ అసిసెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఏ భరత్‌చంద్రకు కాజీపేట సర్కిల్లో ఆర్ఐగా పోస్టింగ్ ఇచ్చారు.
కమిషనర్ సీసీగా విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ అసిస్టెంట్ బీ అన్వేశ్‌ను కాజీపేట సర్కిల్లో ఆర్ఐగా బదిలీ చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న పీ రజినికి కాజీపేట సర్కిల్లో ఆర్ఐగా పోస్టింగ్ ఇచ్చారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న లింగమూర్తికి కాశీబుగ్గ పరిధిలో ఆర్ఐగా పోస్టింగ్ ఇచ్చారు. ట్రెజరీలో విధులు నిర్వర్తిస్తున్న జే నవనీత్కుమార్ను కాశీబుగ్గ సర్కిల్ పరిధిలో ఆర్ఐగా పోస్టింగ్ ఇచ్చారు. సాధారణ పరిపాలన విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న డీ సమ్మయ్యకు కాశీబుగ్గ సర్కిల్లో ఆర్ఐగా పోస్టింగ్ ఇచ్చారు. లీగల్ సెక్షన్లో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఎస్ శ్రీకాంత్‌కు కాజీపేట పరిధిలో ఆర్ఐగా పోస్టింగ్ ఇచ్చారు.