హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 28 : భానుడి భగభగలకు ఉపశమనం పొందాలని ఆశించే నగరవాసులకు, శిక్షణ పొందే క్రీడాకారులకు హనుమకొండ బాలసముద్రంలోని స్విమ్మింగ్‌పూల్ నిరాశనే మిగులుస్తున్నది. అధికారులు, ప్రజాత్రినిధుల పర్యవేక్షణ లోపంతో అతుకుల బొంతలా మారింది. స్విమ్మింగ్‌పూల్‌లో ఒక వైపు రిపేర్లు చేస్తుంటే మరోవైపు పగుళ్లు ఏర్పడుతున్నాయి. గత నెలలో రూ. 20 లక్షలతో స్విమ్మింగ్ పూల్ మరమ్మతు చేసి నీరు నింపడంతో పగుళ్లు వచ్చి ఒకవైపు గోడ కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో పరిశీలించిన అధికారులు దానిని తొలగించి కొత్తది నిర్మించాలని ఆదేశించడంతో మంజూరైన నిధులు సరిపోకపోవడంతో మరో రూ.20 లక్షలు అదనంగా కేటాయించారు. కాగా, ఇటీవల కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పరిశీలించి త్వరగా స్విమ్మింగ్‌పూల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అయితే ఓవైపు ఏర్పడిన పగుళ్లకు మరమ్మతు చేసి నీరు నింపగా మరోవైపు పగుళ్లు ఏర్పడడంతో పూల్ చుట్టూ కొత్తగా గోడలు నిర్మించాలని ఇన్చార్జి డీవైఎస్వోను కలెక్టర్ ఆదేశించారు. అయితే ఇప్పటికే తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూడీసీ) ఆధ్వర్యంలో పలు మరమ్మతులకు రూ. 40 లక్షలు వినియోగించగా, ఇప్పుడు చుట్టూ గోడ నిర్మించేందుకు మరో రూ.20 లక్షలు అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
స్విమ్మింగ్ పూల్ పక్కనే బేబీ స్విమ్మింగ్ పూల్‌ను మరమ్మతు చేయకుండా అలాగే వదిలేశారు. కలెక్టర్ ఆదేశించినా పనులు జరగడంలేదని తెలుస్తోంది. చుట్టూ గోడలు పగిలిపోయి, ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి. కాంట్రాక్టర్ ఇష్టారీతిన వ్యవహరిస్తుండడంతో 10 నెలలైనా ఇంకా పనులు పూర్తి కాలేదని ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ నిర్ల క్ష్యం వల్ల యువ స్విమ్మర్లు సాధనకు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు దూరమవుతూ కెరియర్ నష్టపోతుంటే, ఎండా కాలంలో ఆరోగ్య రక్షణ కోసం స్విమ్మింగ్ పూల్‌కు వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏడా ది స్విమ్మింగ్‌పూల్‌కు సుమారు రూ.10లక్షల వరకు ఆదాయం చేకూరేదని, మరమ్మతులతో రూ.10 లక్షలు నష్టం జరిగినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.
స్విమ్మింగ్ పూల్‌లో పగిలిపోయిన టైల్స్, గ్రానైట్స్, ఎడమవైపు కొత్తవి వేసి నీళ్లు నింపగా, కుడివైపు కూడా గోడ పగుళ్లు వచ్చాయి. కలెక్టర్ చుట్టూ ఉన్న గోడలను తొలగించి కొత్తగా నిర్మించాలని ఆదేశించారు. ఇటీవల అధికారులు సైతం పరిశీలించారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రి తం నిర్మించిన గోడ బేస్మెంట్కు, ఇటుకకు గ్యాప్ ఉండడంతో పగుళ్లు వస్తున్నాయి. మరో రెండు నెలల్లో స్వి మ్మింగ్ పూల్ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తాం. సుమారు రూ. 40 లక్షలతో సోలార్, రెండు కొత్త మోటర్లు, షెడ్ నిర్మాణం, వాటర్ ఫిల్టర్ చేంజ్, సంపుపై స్లాబ్ మరమ్మతు, ఎలక్ట్రిక్, శానిటరీ పనులు
– కొత్త ప్రశాంత్, ఇన్చార్జి డీవైఎస్వో, హనుమకొండ