రాయపర్తి : మండలంలోని కొండూరు జెడ్పిహెచ్ పాఠశాల విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం(Drugs), మత్తు పదార్థాల వనం వల్ల కలిగే అనర్ధాలపై గురువారం ‘జెండర్ ఈక్వాలిటీ గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్’ నేతృత్వంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ స్వరూప ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గుడుంబా, బెల్లం, గంజాయి, డ్రగ్స్ వినియోగించడం వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నట్లు తెలిపారు.
ఇలాంటి వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కొనతం పద్మలత, ఉపాధ్యాయులు శ్రీదేవి, అనిత రాణి, అమర స్వర్ణ, రమాదేవి, సత్యం, రామ్ రెడ్డి, ఆచార్య, సత్యనారాయణ, రఘు, వెంకటరమణ, నాగరాజు, శ్యాంసుందర్, బోజ్యా నాయక్, స్వామి, శివకృష్ణ పాల్గొన్నారు.