మొలకెత్తని చేను పరిశీలన
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో మొలకెత్తని మక్కజొన్న వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం స్థానిక ఏవో అడుప కవిత పరిశీలించారు. ఒంటిమామిడిపల్లికి చెందిన రైతు బండారి శ్రీను వెంకటాపురం శివారులో 1.20 ఎకరాల భూమిని కౌలు తీసుకొని ఓ కంపెనీకి చెందిన మక్కజొన్న విత్తనాలను మండలకేంద్రంలోని ఓ డీలర్ వద్ద కొనుగోలు చేసి విత్తగా 90శాతం మొలకెత్తలేదు.
- ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు : ఏవో
- నమస్తే తెలంగాణ ఎఫెక్ట్
ఐనవోలు, జూన్ 18 : హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో మొలకెత్తని మక్కజొన్న వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం స్థానిక ఏవో అడుప కవిత పరిశీలించారు. ఒంటిమామిడిపల్లికి చెందిన రైతు బండారి శ్రీను వెంకటాపురం శివారులో 1.20 ఎకరాల భూమిని కౌలు తీసుకొని ఓ కంపెనీకి చెందిన మక్కజొన్న విత్తనాలను మండలకేంద్రంలోని ఓ డీలర్ వద్ద కొనుగోలు చేసి విత్తగా 90శాతం మొలకెత్తలేదు. దీంతో తనకు రూ. 25 వేల వరకు నష్టం వాటిల్లిందని సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించి ఈనెల 16న ‘మొలకెత్తని మక్కజొన్న విత్తనాలు’ శీర్షికన నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. ఈ మేరకు మక్కజొన్న విత్తనాల మొలక శాతం తెలుసుకోవడానికి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు ఆమె తెలిపారు. ల్యాబ్ రిపోర్టు ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కవిత పేర్కొన్నారు. కాగా, మండలంలోని ఏ రైతైనా విత్తనాలు మొలకెత్తలేదని డీలర్ల దృష్టికి తీసుకొస్తే గుట్టు చప్పుడు కాకుండా అదే కంపెనీకి చెందిన మరో మక్కజొన్న విత్తనాల బస్తాలను ఉచితంగా ఇచ్చి పంపుతున్నట్లు రైతులు చర్చించుకుంటున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

