ములుగు, జనవరి 13(నమస్తే తెలంగాణ) : కరౌకే సంగీతంలో విశేష ప్రతిభ చాటుతూ 830 పాటలను తనదైన రీతిలో పాడుతూ శ్రోతలను ఆహ్లాద పర్చుతున్న ములుగు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె.ఏ.గౌస్ హైదర్‌కు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఈమేరకు శనివారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నీరజ చేతుల మీదుగా గౌస్‌హైదర్ అవార్డు, ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా గౌస్‌హైదర్ మాట్లాడుతూ కరౌకే ట్రాక్‌లను ఉపయోగించి 830 పాటలను పాడటంతో పాటు 600 పాటలను ఎంపీ-3 ఫార్మేట్లో రికార్డు చేయించినట్లు తెలిపారు. పదేళ్ల నుంచి కరౌకే సంగీతంలో పాడుతున్న పాటల రికార్డులను ఆసియా బుక్ ఆఫ్ రికార్డు సంస్థకు పంపగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.