గిర్మాజీపేట, జనవరి 25 : కార్మికుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుం డా కృషి చేస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బుధవారం రాజశ్రీగార్డెన్‌లో సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. కార్మికుల సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి తక్షణమే పరిష్కా రం చూపారు. అనంతం ఆయన మాట్లాడుతూ.. తాను కార్మిక బిడ్డనేనని, ఎల్లప్పు డూ అందుబాటులో ఉండి అండగా ఉం టానని హామీ ఇచ్చారు.
నిరుపేద కార్మికుల పిల్లల కోసమే నియోజకవర్గంలో 7గురుకులాలు, 2డిగ్రీ కళాశాలలు తీసుకొచ్చామని గుర్తుచేశారు. మెరుగైన వైద్యం కోసం రూ.1100కోట్లతో సూపర్‌స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తున్నామన్నారు. అత్యవసర వైద్యానికి ప్రభుత్వం ద్వారా లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్వోసీ) ఇప్పిస్తామని, కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచిచారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత లేని కార్మికులకు తన సొంత ఖర్చులతో ప్రమా ద బీమా సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో లేబర్ కమిషనర్ సునీత, ఆర్డీవో సిద్ధిఖీ ఆఫ్రిన్, ట్రాఫిక్ ఏసీ పీ మధుసూదన్, సీఐ బాబూలాల్, బీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు బోగి సురేశ్, నాయకులు మర్రి శ్రీనివాస్, దు బ్బ శ్రీనివాస్, కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్‌కుమార్, కార్మిక నాయకులు చింతాకుల సునీల్, ఇనుముల మల్లేశం, మేడిది మధుసూదన్, ఆడెపు భిక్షపతి, ఎండీ యాకూబ్‌పాషా, సంజీవ్, రాజు, శ్రీధర్‌రెడ్డి, బాబు, సాంబయ్య, ఐలయ్య, రాములు, ఈశ్వర్, ఏకాంబ్రం, రజిత, మహమూద్, శ్రీలత, బాబు తదితరులు పాల్గొన్నారు.
‘దళితబంధు’ షాపు ప్రారంభం..
కాశీబుగ్గ : బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలోనే దళితులు రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. కాశీబుగ్గలో దళితబం ధు పథకం లబ్ధిదారుడు చిన్నబాబు ఏర్పా టు చేసుకున్న స్పోర్ట్స్ స్టోర్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దళితబంధు పథకంతో నిరుపేద దళితులు ఆర్థికంగా ఎదుగుతున్నట్లు తెలిపారు. కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్, సురేష్‌జోషి, మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్, బయ్యా స్వామి పాల్గొన్నారు.