గురువారం 21 జనవరి 2021
Warangal-rural - Mar 28, 2020 , 02:55:27

రూ.24.55 కోట్లతో బల్దియా తాత్కాలిక బడ్జెట్‌

రూ.24.55 కోట్లతో బల్దియా తాత్కాలిక బడ్జెట్‌

  • ఒక్క నెల కోసం సిద్ధం చేసిన అధికారులు
  • తక్షణ అవసరాల కోసం వినియోగించేందుకు ఆమోదం

వరంగల్‌, నమస్తే తెలంగాణ: బల్దియా అధికా రులు ఏప్రిల్‌ నెల కోసం రూ. 24.55 కోట్లతో తాత్కాలిక బడ్జెట్‌ను రూపొందించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 294.06 కోట్లతో బడ్జెట్‌ రూపొందించగా, సమావేశం నిర్వహించక పోవడంతో అది ఆమోదం పొందలేదు. కరోనా నేపథ్యంలో అత్యవసర సేవలు అందించేందుకు, నిధుల విడుదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా సీడీఎంఏ ఆదేశాల మేరకు నెల బడ్జెట్‌ను సిద్ధం చేశారు. వార్షిక బడ్జెట్‌ రూ.294.06 కోట్లను 12 నెలలకు విభజించి రూ.24.55 కోట్లతో నెల బడ్జెట్‌ను సిద్ధం చేశారు. ఏప్రిల్‌ నెలకు సంబంధిం చి ఉద్యోగుల వేతనాలు, కార్యాలయ నిర్వహణ, కరంట్‌ బిల్లుల చెల్లింపులతో పాటు కరోనా నేప థ్యంలో అత్యవసర కొనుగోళ్ల కోసం ఆ నిధులు ఖర్చు చేయనున్నారు. గతంలో ఎన్నడూ లేని వి ధంగా కార్పొరేషన్‌ మొదటిసారి నెల రోజుల బడ్జె ట్‌ను రూపొందించింది. శనివారం బల్దియా తా త్కాలిక  బడ్జెట్‌ను కలెక్టర్‌ ఆమోదించనున్నారు. 


logo