మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Feb 24, 2020 , 03:30:44

నిరుపేదలకు అండగా సీఎం కేసీఆర్‌

నిరుపేదలకు అండగా సీఎం కేసీఆర్‌

పరకాల, నమస్తే తెలంగాణ/ ధర్మారం/ గీసుగొండ/ ఆత్మకూరు/సంగెం : నిరుపేదలకు అండగా సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం నిలుస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండలో తన నివాసంలో నియోజకవర్గంలోని ఆత్మకూరు, దామెర, గీసుకొండ, సం గెం, ఖిలావరంగల్‌ మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్థోమతలేని పేద ప్రజలను సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ఆదుకుంటున్నట్లు తెలిపారు. బాధితులందరికీ రిలీఫ్‌ ఫండ్‌ ద్వా రా ఆర్థిక సహాయం అందుతోందనన్నారు. నియోజకవర్గంలో 23మందికి  ప్రభుత్వం నుంచి రూ.6.91లక్షల చెక్కులను మంజూరు కాగా, అందరికీ అందజేసినట్లు తెలిపారు. కాగా, చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డికి  కృతజ్ఞతలు తెలిపారు. కాగా, గీసుగొండ మండలంలోని ఎనిమిది మంది బాధితులకు రూ2.80 లక్షల చెక్కులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు, కుడా డైరెక్టర్‌ వీరగోని రాజుకుమార్‌, సర్పంచ్‌లు పూండ్రు జైపాల్‌రెడ్డి, దౌడు బాబు, గోనె మల్లారెడ్డి, బోడకుంట్ల ప్రకాశ్‌, వీరాటి కవిత, వాంకుడోతు రజిత, ఊకల్‌ ఎంపీటీసీ వీరరావు, నాయకులు మంత రాజయ్య, చిన్ని, రమే శ్‌, మహెబూబ్‌నాయక్‌, రవీందర్‌రెడ్డి, బాలరాజు పాల్గొన్నారు. అలాగే, గ్రేటర్‌ వరంగల్‌ 3వ డివిజన్‌ ధర్మారం గ్రా మానికి చెందిన రుద్రారపు హైమావతికి రూ. 20వేల చెక్కు ఎమ్మెల్యే అందజేశారు. 


ఆత్మకూరు మండలం  మల్కపేట, కొత్తగట్టు, పెద్దాపురం, గూడెప్పాడ్‌  గ్రామాలకు చెందిన బాధితులకు సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో గూడెప్పాడ్‌ మార్కెట్‌ చైర్మన్‌ కాం తాల కేశవరెడ్డి, ఏనుమాముల మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ధర్మరాజు, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ అంబటి రాజస్వామి, సర్పంచ్‌లు మాడిశెట్టి వేణుగోపాల్‌, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి బొల్లెబోయిన రవియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. అంతేకాక సంగెం మండలానికి చెందిన ఏడుగురు బాధితులకు రూ.1.24 లక్షల సీఎంఆర్‌ ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే ధర్మారెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, జెడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, పల్లార్‌గూడ ఎంపీటీసీ గుగులోతు వీరమ్మ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, కొనకటి మొగిలి, సర్పంచ్‌ బీచ్యానాయక్‌, గుగులోతు గోపిసింగ్‌ పాల్గొన్నారు.