ఆదివారం 24 జనవరి 2021
Warangal-rural - Jan 18, 2020 , 04:25:42

ప్రతి పోలీస్‌ రోల్‌మోడల్‌గా నిలవాలి

ప్రతి పోలీస్‌ రోల్‌మోడల్‌గా నిలవాలి
  • - సీపీ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌
  • - సీపీటీసీలో కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం

మడికొండ, జనవరి17: ప్రతి పోలీస్‌ రోల్‌ మోడల్‌గా నిలవాలని నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ సూచించారు. నగర పోలీస్‌ శిక్షణ కేంద్రం(సీపీటీసీ)లో  పోలీస్‌ కానిస్టేబుళ్లుగా ఎంపికైన హైదరాబాద్‌కు చెందిన 264మంది స్టయిఫండరీ అభ్యర్థులకు  శుక్రవారం శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై సీపీ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా శిక్షణ కేంద్రం వైస్‌ ప్రిన్సిపాల్‌ సాంబయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. ప్రజల కోసం సేవ చేసేది పోలీస్‌ శాఖ అని, పోలీసుల త్యాగాలు సమాజంలో చిరస్థాయిగా గుర్తిండి పోతాయన్నారు. ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ.., ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధంగా ఉంటారని చెప్పారు. శిక్షణలో భాగంగా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, డ్రిల్‌, ఆధునిక ఆయుధాల పనితీరు, రోజువారీగా విధులు, చట్టాలపై అవగాహన, టెక్నాలజీ తదితర అంశాల్లో నిష్ణాతులను చేయడం జరుగుతుందన్నారు. పోలీసుల్లో ఎస్సై నుంచి ఎస్పీ వరకు ఎదిగిన అధికారులు ఉన్నారని, నీతినిజాయితీతో పని చేస్తే అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. శిక్షణలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని పర్‌ఫెక్ట్‌ పోలీస్‌గా బయట అడుగు పెట్టాలని సూచించారు. ఫ్యామిలీని, ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్‌ మురళీధర్‌ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి వచ్చి పోలీస్‌ వ్యవస్థలో భాగస్వాములయ్యారని చెప్పారు. సమాజంలో పోలీసులకు ప్రత్యేక గుర్తింపుతో పాటు చాలా క్రేజ్‌ ఉంటుందన్నారు. ఈస్ట్‌జో న్‌ డీసీపీ నాగరాజు, అదనపు డీసీపీలు వెం కటలక్ష్మి, మల్లారెడ్డి, భీంరావు, గిరిరాజు, ఏసీపీలు జితేందర్‌రెడ్డి, రవీందర్‌కుమా ర్‌, సారంగపాణి, సీపీటీసీ ఇన్‌స్పెక్టర్లు రా మ్మూర్తి, సీతారెడ్డి, మ డికొండ ఇన్‌స్పెక్టర్‌ జా న్‌ నర్సింహులు, ఇం డోర్‌, అవుట్‌డోర్‌ శిక్షణ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
logo