Hash Oil | సుబేదారి (వరంగల్) : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ స్థాయిలో హాష్ ఆయిల్ (గంజాయి మొక్కల నుండి తీసిన నూనె) స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను వరంగల్ పోలీస్ కమిషనరేట్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్గంజ్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ఈ ముఠా నుండి పోలీసులు సుమారు రూ.2 కోట్ల 50 లక్షల విలువ గల హాష్ ఆయిల్‌తో రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని సీపీ కార్యాలయంలో సీపీ సన్ ప్రీత్ సింగ్ నిందితులను అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు.
ఒడిశాకు చెందిన హంటల్ సన్ను, హంటల్ సన్యాసి, కృష్ణా హంటర్ ఏపీకి చెందిన కండల చిన్నబాబు, పరారీలో ఉన్న పాండు ముఠాగా ఏర్పడ్డారు. ప్రధాన నిందితుడు హంటల్ సన్ను స్వగ్రామంలో గంజాయి మొక్కలను పెంచుతూ వాటిని మిగితా నిందితుల ద్వారా విక్రయించేవాడు. గంజాయి విక్రయాలతో వచ్చే డబ్బు జల్సాలకు సరిపోకపోవడంతో ప్రధాన నిందితుడు గంజాయి మొక్కల నుండి హాష్ అయిల్ తయారు చేసి, పాండు సూచనల మేరకు పాండు తీసుకవచ్చిన పరికరం ద్వారా ఈ ముఠా సభ్యులు గంజాయి మొక్కల ద్వారా 40కిలోల హాష్ అయిలు సేకరించారు.
గంజాయి మొక్కల ద్వారా తయారు చేసిన హాష్ అయిల్లో 20కిలోల హాష్ అయిల్ పాండు ముఠా తీసుకోగా, మిగితా 20కిలోల హాష్ అయిలు కిలో చొప్పున ప్యాకేట్లలో భద్రపర్చి మిగితా ముఠా సభ్యులు 5 కిలోల చోపున హాష్ అయిల్ ను ముంబైలో విక్రయించేందుకు ఆంధ్రప్రదేశ్ తుని రైల్వే స్టేషన్ నుండి ఈ నెల 19 తేదీ అర్ధరాత్రి కోనార్క్ రైలులో బయలు దేరారు. వరంగల్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా అనుమానం రావడంతో నిందితులను తనిఖీలు చేసి, నిందితుల నుంచి పెద్ద మొత్తంలో హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు.
Glaucoma | గ్లోకోమా లక్షణాలు ఇవే.. ముందుగా స్పందించకపోతే శాశ్వత అంధత్వం వచ్చే అవకాశం..
TVK Chief Vijay | నా పార్టీ నిజాయితీగల నిప్పుకణిక.. పోలింగ్ ముందు ప్రజలకు టీవీకే చీఫ్ బహిరంగ లేఖ
Yusuf Pathan | ముంబయిలో క్రికెటర్ యూసుఫ్ పఠాన్ బంధువులపై కేసు నమోదు
Donald Trump: ఇరాన్‌తో డీల్ కోసం ఇస్లామాబాద్ వెళ్లనున్న ట్రంప్ !