గోదావరి ఉగ్రరూపం
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూ పం దాల్చింది. కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్నది.
- కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం
- రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 15.650 మీటర్లు
- రాత్రి వరకు రెండో ప్రమాద హెచ్చరిక దాటే అవకాశం
- పేరూరు వద్ద 17.280 మీటర్లు
- ములుగు జిల్లాలో పలు చోట్ల వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి సీతక్క
- కొండాయి నుంచి గర్భిణుల తరలింపు
ఏటూరునాగారం/తాడ్వాయి/ములుగు రూరల్/గోవిందరావుపేట/వాజేడు/కాళేశ్వరం, జూలై 22: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూ పం దాల్చింది. కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్నది. తెలంగాణ, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో గోదావరి, ప్రాణహిత నదులు పొంగి 9,36,890 క్యూసెక్కుల నీరు వస్తూ 12.25 మీట ర్ల ఎత్తు దాటి లక్ష్మీ బరాజ్ వైపు పరుగులు తీస్తున్నాయి. పుష్కరఘాట్ పూర్తిగా మునిగిపోయింది. అక్కడ ఉన్న ప్రజలను అధికారులు దగ్గరలోని ప్రాథమిక పాఠశాలకు తరలించారు. ఏటూరునాగారం ముల్లకట్ట బ్రిడ్జి వద్ద రెండు కిలోమీటర్ల వెడల్పుతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 15.650 మీటర్లకు చేరింది. రాత్రి వరకు రెండో ప్రమాద హెచ్చరిక 15.830 మీటర్ల స్థాయి దాటే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వాజేడు మండలంలోని పేరూరు వద్ద 17.280 మీటర్లకు గోదావరి నీటిమట్టం చేరింది.
వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి సీతక్క
ఏటూరునాగారం మండలంలోని ఓడవాడ, రామన్నగూడెంలోని పుష్కరఘాట్, ముల్లకట్ట బ్రిడ్జి వద్ద గోదావరి వరదను మంత్రి సీతక్క పరిశీలించారు. వరదలు వస్తే అప్రమత్తంగా ఉండాలని, బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. మేడారంలోని జంపన్నవాగుతోపాటు ముంపు గ్రామాలను మంత్రి సీతక్క పరిశీలించారు. కలెక్టర్ దివాకర, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, ఎస్పీ శబరీష్‌తో కలిసి మొదటగా ఎల్బాక వద్ద వరదనీటిని పరిశీలించారు. గోవిందరావుపేట మండలంలోని పస్రా శివారులోని గుండ్లవాగు బ్రిడ్జి, రాఘవపట్నంలోని దయ్యాలవాగు బ్రిడ్జిలను సీతక్క పరిశీలించి ఇరువైపులా సైడ్ వాల్స్‌ను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ములుగు మండలం బండారుపల్లి శివారులోని రాళ్లవాగు వద్ద నిర్మిస్తున్న వంతెన పక్కన ఉన్న తాత్కాలిక రోడ్డు తెగిపోవడంతో సీతక్క పరిశీలించారు. పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గర్భిణులను ఏటూరునాగారానికి తరలింపు
కొండాయి, మల్యాల గ్రామాలకు చెందిన పాయం స్నేహ, దబ్బగట్ల భవానిని ఊరట్టం, మేడారం మీదుగా అంబులెన్స్‌లో ఏటూరునాగారంలోని సామాజిక వైద్యశాలకు తరలించినట్లు వైద్యాధికారి ప్రణీత్ కుమార్ తెలిపారు. వైద్య సిబ్బంది భాస్కర్, సమ్మక్క, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

