వంద అడుగుల జాతీయ పతాక
వంద అడుగుల ఎత్తులో జాతీయ పతాకం రెపరెపలాడనుంది. ఇస్రో, డీఆర్డీవో సాంకేతిక సహకారంతో దీన్ని తొర్రూరులోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రోత్సాహంతో మండల అభివృద్ధి కమిటీ, జాతీయ పతాక ప్రతిష్ఠాపనోత్సవ కమిటీ చైర్మన్ డాక్టర్ పొనుగోటి సోమేశ్వర్రావు నేతృత్వంలో దాతల సహకారంతో రూ.20లక్షల వ్యయంతో ఈ భారీ జెండాను తీర్చిదిద్దారు
- తొర్రూరుకే తలమానికంగా నిలువనున్న తిరంగా
- రేపు మంత్రి దయాకర్‌రావు చేతుల మీదుగా ఆవిష్కరణ
- ఉమ్మడి జిల్లాలోనే ఎత్తయిన జాతీయ జెండాగా గుర్తింపు
తొర్రూరు, ఆగస్టు 27 : వంద అడుగుల ఎత్తులో జాతీయ పతాకం రెపరెపలాడనుంది. ఇస్రో, డీఆర్డీవో సాంకేతిక సహకారంతో దీన్ని తొర్రూరులోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రోత్సాహంతో మండల అభివృద్ధి కమిటీ, జాతీయ పతాక ప్రతిష్ఠాపనోత్సవ కమిటీ చైర్మన్ డాక్టర్ పొనుగోటి సోమేశ్వర్రావు నేతృత్వంలో దాతల సహకారంతో రూ.20లక్షల వ్యయంతో ఈ భారీ జెండాను తీర్చిదిద్దారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, 1650 క్వింటాళ్ల బరువైన జెండా పోల్‌పై 30 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో జాతీయ పతాకం రూపుదిద్దుకుంది.
సుమారు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరం నుంచి జాతీయ జెండా రెపరెపలాడుతూ రెపరెపలాడుతూ కనిపిస్తూ దేశ ఔన్నత్యం, తొర్రూరు ఘనకీర్తిని చాటనుంది. ఈ నెల 29న మంత్రి ఎర్రబెల్లి ఇక్కడ ఈ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. మంత్రితోపాటు మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, కలెక్టర్ కె.శశాంక, సీబీఐ పూర్వ డైరెక్టర్ వీవీ లక్ష్మినారాయణ, ఎస్పీ శరత్చంద్ర పవార్, ఉషాదయాకర్‌రావు, కోఆర్డినేటర్‌గా వందేమాతరం ఫౌండేషన్ టి.రవీంద్ర పాల్గొననున్నారు. కాగా, శనివారం నిర్వాహకుడు సోమేశ్వర్రావు ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, తహసీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి, కమిటీ సభ్యులు శామకూరి ఐలయ్య, గుండాల నర్సయ్య, దొంగరి శంకర్, కుర్ర శ్రీనివాస్, ధరావత్ జైసింగ్‌నాయక్, చీకటి శ్రీనివాస్, కందాటి అశోక్‌రెడ్డి, కౌన్సిలర్ గుగులోత్ శంకర్, జిలుకర సురేందర్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

