గురువారం 29 అక్టోబర్ 2020
Vikarabad - Sep 20, 2020 , 01:48:54

పేదల వైద్యానికి మరింత భరోసా

పేదల వైద్యానికి మరింత భరోసా

అంబులెన్సులు అందజేసిన ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌ రెడ్డి

 రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/షాబాద్‌ : మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా గిప్ట్‌ ఏ స్మైల్‌ పిలుపునకు స్పందించిన పలువురు టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు కొవిడ్‌ రెస్పాన్స్‌ అంబులెన్స్‌లను ఇవ్వడానికి ముందుకువచ్చారు. దీనిలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్‌ స భ్యుడు డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి ఈనెల 18న తన పుట్టినరోజు సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో ఐదు కొత్త అంబులెన్స్‌లను అందించేందుకు ముందుకు వచ్చారు. శనివారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ జెండా ఊపి అంబులెన్స్‌లను ప్రా రంభించారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, అరికెపూడి గాంధీ తదితరులున్నారు. 

 పరిగి: మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్‌ ఏ స్మైల్‌కు ప్సందించిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అంబులెన్స్‌ కోసం రూ.20.50లక్షలు అందజేయగా శనివారం మంత్రి కేటీఆర్‌ అంబులెన్స్‌ను ఎమ్మెల్యే మహేశ్‌ రెడ్డికి అందజేశారు. రెండు, మూడు రోజుల్లో అంబులెన్స్‌ను వాడుకలోకి తీ సుకువస్తామని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు.పరిగి నియోజక వర్గంలో వైద్య సేవల కోసం అంబులెన్స్‌ను ఉపయోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు.