శనివారం 27 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 20, 2021 , 00:27:22

రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలువండి..

రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలువండి..

కొడంగల్‌, జనవరి 19 : రక్తదానం ప్రాణదానంతో సమానమని, రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఈస్ట్‌ భాన్‌జీ ఖేరాజ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ప్రతినిధి విజయ్‌ తెలిపా రు. శుక్రవారం జియో లైఫ్‌ ఫౌండేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో శాంతినగర్‌కాలనీలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం అనేది ఆపత్కాలంలో ఓ నిం డు ప్రాణాన్ని కాపాడుతుందని, అటువంటి ప్రాముఖ్యత గల రక్తదానం కార్యక్రమాన్ని ప్రతి ఒక్క రూ ప్రోత్సహించాలన్నారు. రక్తం అందించడం వల్ల ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు రావన్నారు. సంవత్సరంలో ఓసారి తప్పక రక్తదానం చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలన్నారు. రక్తదానం చేసిన వారికి  సర్టిఫికెట్‌లను అందించారు. కార్యక్రమంలో నాయకులు పున్నచంద్‌ లాహోటీ, ఆనంద్‌కుమార్‌ లాహోటీ, నేహాలాహోటీ, కృష్ణాయాదవ్‌ పాల్గొన్నారు. 

VIDEOS

logo