మంగళవారం 02 మార్చి 2021
Vikarabad - Jan 10, 2021 , 00:12:07

తుదిదశకు..

తుదిదశకు..

 • రెండు రోజుల్లో పూర్తి కానున్న ధాన్యం కొనుగోళ్లు
 • 121 కేంద్రాల్లో ఇప్పటికే 85 మూసివేత
 • ఇప్పటివరకు 54,470 టన్నుల ధాన్యం సేకరణ
 • రూ.112 కోట్లకు 90కోట్లు రైతుల ఖాతాల్లో జమ

వికారాబాద్‌ జిల్లాలో వానకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు తుదిదశకు చేరుకున్నాయి. జిల్లాలో మొత్తం 121 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా.. ఇప్పటికే 85 చోట్ల ధాన్యం సేకరణ పూర్తికాగా సెంటర్లను మూసివేశారు.  మరో 36 కేంద్రాల్లో రెండు రోజుల్లో పూర్తికానున్నది. మొత్తం 1.40లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు రూ.112కోట్లతో 54,470 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ.90కోట్లు జమ చేయగా.. మిగతా రూ.22కోట్లు చెల్లించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 

 • మరో రెండు రోజుల్లో కొనుగోళ్లు పూర్తి           
 • రైతుల ఖాతాల్లో డబ్బులు జమ                   
 • వికారాబాద్‌ జిల్లాలో 121 కొనుగోలు కేంద్రాలు  
 • టార్గెట్‌ 1.40 లక్షల టన్నుల్లో 54,470 టన్నుల ధాన్యం సేకరణ 
 • g  జిల్లాలో 68,297 ఎకరాల్లో వరి సాగు           
 • రూ.112 కోట్లు ధాన్యం కొనుగోళ్లు 
 • రైతుల ఖాతాల్లో రూ.90 కోట్లు జమ     
 • 85 కేంద్రాలు మూసివేత, 36 ద్వారా ధాన్యం సేకరణ

వికారాబాద్‌, జనవరి9,(నమస్తే తెలంగాణ): వానకాలంలో పండిన ధాన్యం, మక్కల కొనుగోళ్లు తుది దశకు వచ్చాయి. వికారాబాద్‌ జిల్లావ్యాప్తంగా 121 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 85 కేంద్రాలు మూసివేశారు. ఇంకా 36 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నారు. జిల్లాలోని పీఏసీఎస్‌, ఐకేపీ, మార్కెట్‌ కమిటీల పరిధిలో  కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షాలకు అంతేస్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చింది. గతేడాది నవంబర్‌ 2వ వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఆదివారం లేదా సోమవారంతో ముగించే దిశగా అడుగులు వేస్తున్నారు. గ్రేడ్‌ ఏ రకం ధాన్యం క్వింటాలుకు రూ.1888, సాధారణ రకం గ్రేడ్‌-బీకి రూ.1868 ప్రకటించి రెండు నెలలుగా కొనుగోలు చేశారు. 

టార్గెట్‌ 1.40 లక్షల టన్నుల ధాన్యం సేకరణ 

జిల్లాలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 1.40 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలనే టార్గెట్‌గా నిర్దేశించుకున్నారు. ఇప్పటి వరకు 54,470.560 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందుకు సంబంధించిన డబ్బులు రూ.112 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. రూ.90 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా రూ.22 కోట్లు జమ కావాల్సి ఉంది. జిల్లాలో 68,297.33 ఎకరాల్లో 43,309 మంది రైతులు వరి పంట సాగు చేశారు. పంట దిగుబడి 1.40 లక్షల టన్నులు వస్తుందని అంచనా వేశారు. వాతావరణంలో మార్పులు రావడంతో ఎక్కడైనా మిగిలిపోయిన రైతులు ధాన్యం తీసుకొచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. 

వానకాలం ధాన్యం కొనుగోలు వివరాలు

మొత్తం కొనుగోలు కేంద్రాలు : 121

ధాన్యం సేకరణ చేస్తున్నవి : 36 

మూసివేత : 85

ఇప్పటి వరకు కొన్నది : 57,470.560 మెట్రిక్‌ టన్నులు

ధాన్యం అమ్మిన రైతులు : 15,1333

ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం విలువ : రూ.112 కోట్లు 

రైతుల ఖాతాల్లో జమ : రూ.90కోట్లు 

ఇంకా చెల్లించాల్సినవి : రూ.22కోట్లు

నిరంతరం పర్యవేక్షణ..

జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలపై జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించింది. కొనుగోలుకు కావాల్సిన గన్నీ బ్యాగులు, రవాణా సౌకర్యాలను కల్పించారు. కలెక్టర్‌ పౌసమిబసు, అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. కొనుగోళ్లు పెంచేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు భారీగా పెరిగాయి. వరి దిగుబడి ప్రకారం 1.40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సీజన్‌లో 42.50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. గతంలోకంటే ఈసారి 57 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అధికంగా సేకరించినట్లు అధికారులు తెలిపారు.

VIDEOS

logo