సాంకేతిక ప్రపంచాన్ని మార్చడానికి నేనొక్కడినే సరిపోను. నాలాంటి వాళ్లు చాలామంది కావాలి అంటారు అంతరిక్ష ఆంత్రప్రెన్యూర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్. తనలాంటి క్రియేటివిటీ మైండ్స్ను తయారు చేయడానికి ఏకంగా ఓ పాఠశాలనే ప్రారంభించారు ఆయన. ఆ ప్రపంచ ప్రఖ్యాత ఎలాన్ మస్క్ స్కూల్లో సీటు కొట్టాడు తెలంగాణ బిడ్డ అనిక్పాల్. ప్రపంచ బాలలతో పోటీపడి కాలిఫోర్నియాలోని సింథసిస్ స్కూల్లో టెక్నాలజీ పాఠాలు వినబోతున్నాడు. మరి అంత పెద్ద స్కూల్లో సీటు ఎలా వచ్చింది..? అసలు అలాంటి ఒక స్కూల్ ఉందని వీళ్లకు ఎలా తెలిసింది? ఇలాంటి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే..